Thursday, February 7, 2013

సామెతలు

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని వుంది.
అందరు పల్లకీ ఎక్కేవాళ్ళయితే ఇక మోసేవాళ్లెవరు?
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు.
అంబలి తాగే వాడికి మీసాలెత్తే వాడొకడు.
అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాలనాడు బిడ్డలా.
అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లు.
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు
తల్లి పుట్టిలు మేనమామకు తెలియదా?
అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేసినట్లు.
అన్నీవున్న ఆకు అణిగి మణిగి ఉంటుంది ఏమీలేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.
అమ్మ కళ గుమ్మంలోనే తెలుస్తుంది.
అమ్మ పెట్టా పెట్టదు అడుక్కునీ తిననివ్వదు.
ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమెరగదు.
అయ్యవారోచ్చేదాకా అమావాస్య ఆగుతుందా.
అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు.
ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికెగిరిందట.
ఊపిరి బిగబడితే ఉదరం నిండుతుందా?
దున్నపోతుమీద వాన కురిసినట్లు.
మింగమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం.
ఎద్దుపుండు కాకికి ముద్దు.
ఏరు దాటి తెప్ప తగలేసినట్లు.
కుక్కకాటుకి చెప్పుదెబ్బ.
కంచే చేనును మేసినట్లు.
గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు?
కాలు జారితే తీసుకోవచ్చు కాని నోరు జారితే తీసుకోలేము.
కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టిందట.
దొంగలు పడిన ఆరునెలలకు కుక్కలు మొరిగనట్లు.
దాటక ముందు ఓడ మల్లయ్య దాటాక బోడిమల్లయ్య.
నిండు కుండ తొణకదు.
పగలు మాటలు పనికి చేటు రాత్రి మాటలు నిద్రకు చేటు.
పట్టిందల్లా బంగారమే.
దున్నపోతు  ఈనిందంటే దూడను కట్టేయమన్నాట్ట.
నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం.
పిట్ట కొంచెం కూత ఘనం.
రోలు వెళ్లి మద్దెలతో మొర పెట్టుకున్నట్లు.
లోగుట్టు పెరుమాళ్ల కెరుక.
చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు.
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.
సముద్రంలో కాకి రెట్ట.
చదవక ముందు పెసలు పెసలు అన్నాట్ట చదివాకా పిసలు పిసలు అన్నాట్ట.
కట్టె వంకర పొయ్యి తీర్చినట్లు.
అడగనిదే అమ్మయినా పెట్టదు.
అత్తా ఒకింటి కోడలే.
ఏ ఎండాకా గొడుగు పట్టే రకం.
పెదవి దాటిందంటే పృధివి దాటినట్లే.
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
గుడ్డొచ్చి బిడ్డను వెక్కిరించిందట.
ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయి.
గొర్రె తోక ఎంత పెరిగినా బెత్తెడే.
దున్నబోతే దూడల్లో తినబోతే పోతుల్లో.
సూర్యుడి ముందు దివిటీ పెట్టినట్లు.
గుడ్డెద్దు చేలో పడ్డట్టు. 
కాకి పిల్ల కాకికి ముద్దు.

2 comments:

  1. nice blog.....
    వేద గణితం కూడా అందిస్తే ఇంకా బాగుంటుంది ...

    ReplyDelete
    Replies
    1. నమస్కారం సుబ్బారావు గారు. మీ వాఖ్య చూసేవరకు నాకు వేదగణితం గురించి తెలియదు. తెలుసుకుంటున్న కొద్దీ చాలా ఆసక్తిగా అనిపించింది. మంచి సలహా ఇచ్చారు. ప్రయత్నిస్తాను.

      http://www.sakshi.com/news/district/vedic-mathematics-developed-37401

      ధన్యవాదాలు.

      Delete