Monday, January 28, 2013

మహనీయులు

"జాతిపిత" అని ఎవరిని పిలుస్తారు?
 మహాత్మా గాంధీ

భారత దేశపు మొదటి ప్రధాన మంత్రి ఎవరు?
జవహర్ లాల్ నెహ్రు

నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
కలకత్తా, వెస్ట్ బెంగాల్ ,ఇండియా

"నేతాజీ" అని ఎవరిని పిలుస్తారు?
సుభాస్ చంద్రబోస్

"బాలల దినోత్సవం" ఎవరి జన్మదిన సందర్భంగా జరుపుకుంటాము?
జవహర్ లాల్ నెహ్రు

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన యోధుడు ఎవరు?
పొట్టి శ్రీరాములు

"స్వరాజ్యం నా జన్మ హక్కు" ఈ నినాదం ఎవరిది?
బాల గంగాధర తిలక్

"ఉక్కు మనిషి" అని ఎవరిని పిలుస్తారు?
సర్దార్ వల్లభ భాయి పటేల్

"చాచా" అని ఏ దేశ నాయకుని పిలుస్తారు?
భారత దేశము, జవహర్ లాల్ నెహ్రు

"బాపూజీ" అని ఎవరిని పిలుస్తారు?
మహాత్మా గాంధీ


"భారత జాతీయోద్యమ పిత" ఎవరు?
బాల గంగాధర్ తిలక్ 

"మన్నెం దొర" అంటే ఎవరు?
అల్లూరి సీతా రామ రాజు

"సతీ సహగమనాన్ని" రూపు మాపింది ఎవరు?
రాజ రామ్మోహన్ రాయ్

"విద్యా సాగర్" అన్న బిరుదును ఎవరికి ఇచ్చారు? ఆయన ఏమి చేశారు?
ఈశ్వర చంద్ర భందోపాధ్యాయ. మహిళల హక్కులకోసం పోరాటము , వితంతు వివాహాలు ప్రోత్సాహించారు.

"తెలుగు భాష దినోత్సవం" ఎవరి జన్మదిన సందర్భంగా జరుపుకుంటాము?
గిడుగు రామమూర్తి గారు

"ఆధునిక ఆంధ్ర సాహిత్య పితామహుడు" ఎవరు?
కందుకూరి వీరేశలింగం పంతులు

"ఆంధ్రకేసరి" అని ఎవరిని అంటారు?
టంగుటూరి ప్రకాశం పంతులు

"భారత కోకిల" అని ఎవరిని అంటారు?
(కవయిత్రి )సరోజినీ నాయుడు.

తొలి తెలుగు కవయిత్రి ఎవరు?
తాళ్ళపాక తిమ్మక్క 


"బ్రహ్మ సమాజాన్ని" స్థాపి౦చింది ఎవరు?
రాజ రామ్మోహన్ రాయ్

భారతదేశ తొలి రాష్ట్రపతి ఎవరు?
డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్.

No comments:

Post a Comment