Tuesday, January 22, 2013

మహనీయులు

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలుసా? 
ఆసక్తి ఉన్నవారు సమాధానాలు కామెంట్ లో వ్రాయండి. (ఇంగ్లీషులో కూడా వ్రాయొచ్చు). 
  1. "జాతిపిత" అని ఎవరిని పిలుస్తారు?
  2. భారత దేశపు మొదటి ప్రధాన మంత్రి ఎవరు?
  3. నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
  4. "నేతాజీ" అని ఎవరిని పిలుస్తారు?
  5. "బాలల దినోత్సవం" ఎవరి జన్మదిన సందర్భంగా జరుపుకుంటాము?
  6. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన యోధుడు ఎవరు?
  7. "స్వరాజ్యం నా జన్మ హక్కు" ఈ నినాదం ఎవరిది?
  8. "ఉక్కు మనిషి" అని ఎవరిని పిలుస్తారు?
  9. "చాచా" అని ఏ దేశ నాయకుని పిలుస్తారు?
  10. "బాపూజీ" అని ఎవరిని పిలుస్తారు?
  11. "భారత జాతీయోద్యమ పిత" ఎవరు?
  12. "మన్నెం దొర" అంటే ఎవరు?
  13. "సతీ సహగమనాన్ని" రూపు మాపింది ఎవరు?
  14. "విద్యా సాగర్" అన్న బిరుదును ఎవరికి ఇచ్చారు? ఆయన ఏమి చేశారు?
  15. "తెలుగు భాష దినోత్సవం" ఎవరి జన్మదిన సందర్భంగా జరుపుకుంటాము?
  16. "ఆధునిక ఆంధ్ర సాహిత్య పితామహుడు" ఎవరు?
  17. "ఆంధ్రకేసరి" అని ఎవరిని అంటారు?
  18. "భారత కోకిల" అని ఎవరిని అంటారు?
  19. తొలి తెలుగు కవయిత్రి ఎవరు?
  20. "బ్రహ్మ సమాజాన్ని" స్థాపి౦చింది ఎవరు?
  21. భారతదేశ తొలి రాష్ట్రపతి ఎవరు?



సమాధానాలు వచ్చేవారం....


2 comments:

  1. 1. మహాత్మా గాంధి , 2. జవహర్ లాల్ నెహ్రూ 3. కోల్కత 4. సుభాస్ చంద్ర బోస్ 5. జవహర్ లాల్ నెహ్రు 6. పొట్టి శ్రీరాములు 7. తిలక్ 8.వల్లభయి పటేల్ 9. భారత దేశం 10. గాంధిజీ 11. గాంధిజీ 12. అల్లూరి సీతారామ రాజు 13. రాజ రామ్ మోహన్ రాయ్ 14 ఈశ్వర చంద్ర బందోపాద్యాయ 15. గిడుగు రామమూర్తి పంతులు 16. గురజాడ 17. ప్రకాశం పంతులు 18. సరోజినీ నాయుడు 19.మొల్ల 20. రామ్మోహన్ రాయ్ 21. రాజేంద్ర ప్రసాద్

    ReplyDelete
    Replies
    1. అభినందనలు మైత్ర్యేయా. ఈ క్రింద రెండికి చిన్న సవరణ.

      16. కందుకూరి వీరేశలింగం పంతులు. (గురజాడ అభ్యుదయ కవితా పితామహుడు)
      19. తాళ్ళపాక తిమ్మక్క

      Delete