Thursday, October 24, 2013

నక్షత్రాలు- ఆవాలు

కథ, అభ్యాసము: శైలజ వాడకట్టు

       ఒకరోజు అక్బర్ చక్రవర్తి అంతఃపురంలో విహరిస్తున్నాడు. ఆకాశం నిర్మలంగా ఆహ్లాదంగా ఉంది.చుక్కలు మిలమిలా మెరుస్తున్నాయి. వాటిని చూడడంతోనే ఆయనకు ఓ చిలిపి ఆలోచన వచ్చింది.

           మరునాడు సభలో అందరూ తమ తమ స్థానాల్లో కూర్చొని ఉండగా తనకు రాత్రి వచ్చిన ఆలోచన గుర్తుకొచ్చింది. అప్పుడు సభలోని వారందరినీ ఒకసారి పరికించి చూచి "అందరూ జాగ్రతగా వినండి మీరెవరైనా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కించగలరాలెక్కించి చెప్పినవారికి వెయ్యి బంగారు నాణాలను బహుకరిస్తాను. ఇందుకుగాను 15 రోజుల గడువు కూడా ఇస్తాను". అన్నాడు.

         
చక్రవర్తి చెప్పిన గడువు రోజు రానే వచ్చింది. అప్పటికి అందరూ హాజరయ్యారు. కాని బీర్బల్ మాత్రం రాలేదు. ఐదు నిమిషాల తర్వాత బీర్బల్ వచ్చాడు. ఆయన వెనకే ఒక సేవకుడు చిన్నపాటి మూట తీసుకొచ్చి పాదుషా వారి ముందు పెట్టాడు. అది చూసి ఆశ్చర్యపోయిన అక్బర్ " ఏమిటది బీర్బల్?" అని ప్రశ్నించాడు. " మహారాజా! నేను ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించేటప్పుడు పక్కన ఒక ఆవాలగోతం పెట్టుకున్నాను. ఒక్కో నక్షత్రాన్ని లెక్కించగానె ఖాళీగోతంలో ఒక్కో ఆవగింజను వేశాను. ఆకాశంలో ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి. ముందు వీటిని లెక్క పెట్టించండి. అప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎన్నో తెలిసిపోతాయి" అన్నాడు.

      ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించడం సాధ్యం కాదని అక్బర్ కూ తెలుసు. కాని తన ప్రశ్నకు యుక్తితో సమాధానం చెప్పిన బీర్బల్ ను మెచ్చుకొని తాను ముందు గా ఇస్తానన్న బంగారు నాణేలతో సత్కరించాడు.

నీతి: సమయస్పూర్తితో దేనిని ఐన సాధించవచ్చును.

అభ్యాసము 

1.క్రింది వాక్యాలలో తప్పు(x), ఒప్పు(-/) లను గుర్తించండి.

అ. ఆకాశం నిర్మలంగాఆహ్లాదంగా ఉంది. (  )

ఆ. ఇందుకుగాను 20రోజుల గడువు కూడా ఇస్తాను. (  )

ఇ. ఐదు నిమిషాల ముందు బీర్బల్ వచ్చాడు. ( )

ఈ. నక్షత్రాలను లెక్కించడం సాధ్యం కాదని అక్బర్ కూ తెలుసు. ( )


2. క్రింది ఖాళీలను పూరించండి.

అ) ఆయనకు ఓ ..................... ఆలోచన వచ్చింది.

ఆ) వెయ్యి ........................ నాణేలను బహుకరిస్తాను.


ఇ) ఆకాశంలో ఇన్ని ................................ ఉన్నాయి.

ఈ) ............................ చెప్పిన గడువు రానే వచ్చింది. 

3. 
సరైన జవాబుకు ముందున్న అక్షరాన్ని బ్రాకెట్టులో వ్రాయండి.

1. అక్బర్ చక్రవర్తి ఎక్కడ విహరిస్తున్నాడు. (   )

క) నదీ తీరాన గ) అంతపురంలో చ) బజారులో

2. సేవకుడు పాదుషా ముందు దీనిని ఉంచాడు. (    )

క) ఆవాల గోతం గ) జొన్నల గోతం చ) సజ్జల గోతం 

3
ఆకాశంలో నక్షత్రాలను లెక్కించిన వారికి ఎన్ని బంగారు నాణేలు ఇస్తానన్నాడు. (   )

క) వంద గ) పదహారు చ) వెయ్యి

4. క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

అ) అక్బర్ ఎక్కడ విహరిస్తున్నాడు?

ఆ) ఆకాశం ఎలా ఉన్నది?

ఇ) బీర్బల్ రాజు గారికి ఎలా సమాధానం చెప్పాడు?


ఈ) అక్బర్ ఎవరిని సత్కరించాడుఎందుకు?


5. పై కథలో క్రింది ఒత్తులున్న అక్షరాలుగల పదాలను రెండు చొప్పున వ్రాయండి


బ -


ఉదా: రబ్బరు


న -


ఉదా: నాన్న


త -


ఉదా: అత్తరు .

No comments:

Post a Comment