Tuesday, October 15, 2013

పూర్తి వాక్యాలు.

రాజు ఇంటికి వెళ్ళాడు.

ఎవరి కొడుకు?
శివాని గారి అబ్బాయి రాజు ఇంటికి వెళ్ళాడు.

ఎన్నో అబ్బాయి?
శివాని గారి పెద్ద అబ్బాయి రాజు ఇంటికి వెళ్ళాడు.

ఎవరి ఇంటికి?
శివాని గారి పెద్ద అబ్బాయి రాజు అనన్య వాళ్ళ  ఇంటికి వెళ్ళాడు.

అనన్య వాళ్ళ ఇల్లు ఎక్కడుంది?
శివాని గారి పెద్ద అబ్బాయి రాజు చెట్టు మీద  వున్న అనన్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.

ఎందుకు వెళ్ళాడు?
శివాని గారి పెద్ద అబ్బాయి రాజు చెట్టు మీద  వున్న అనన్య వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళాడు.

ఎవరితో ఆడుకోవడానికి?
శివాని గారి పెద్ద అబ్బాయి రాజు చెట్టు మీద  వున్న అనన్య వాళ్ళ ఇంటికి కోతితో ఆడుకోవడానికి వెళ్ళాడు.

ఎప్పుడు వెళ్ళాడు?
శివాని గారి పెద్ద అబ్బాయి రాజు చెట్టు మీద  వున్న అనన్య వాళ్ళ ఇంటికి సాయంత్రం మూడు 
గంటలకు కోతితో  ఆడుకోవడానికి వెళ్ళాడు.

అనన్య వాళ్ళ ఇల్లు ఏ చెట్టు మీద ఉంది?
శివాని గారి పెద్ద పెద్ద అబ్బాయి రాజు పైన్ చెట్టు మీద  వున్న అనన్య వాళ్ళ ఇంటికి సాయంత్రం మూడు గంటలకు కోతితో  ఆడుకోవడానికి వెళ్ళాడు.

ఏం ఆడుకోవడానికి వెళ్ళాడు.
శివాని గారి పెద్ద అబ్బాయి రాజు, పైన్ చెట్టు మీద  వున్న అనన్య వాళ్ళ ఇంటికి, సాయంత్రం మూడు గంటలకు, కోతితో అరటి పండు ఫుడ్ బాల్ ఆడుకోవడానికి వెళ్ళాడు.


పైన ఇచ్చిన ఉదాహరణ ఆధారంగా ఈ క్రింది వాక్యాలు పూర్తి చేయండి.


రవి పార్టీ డ్రస్ వేసుకున్నాడు.
రవి ఎవరి అబ్బాయి?
ఏ రంగు చొక్కా వేసుకున్నాడు?
ఎక్కడికి వెళ్ళడానికి వేసుకున్నాడు?
ఎవరి పుట్టినరోజు/ పార్టీ
పార్టీ డ్రస్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు?
పార్టీ ఎక్కడ?
ఎన్నో పుట్టినరోజు?

టీచర్ రమ్మన్నారు?
ఎవరిని?
ఏ క్లాసు?
ఎన్ని గంటలకు?
ఎవరిని తీసుకుని?
ఎప్పుడు?
ఎందుకు?

విక్కీ పడ్డాడు.
ఎలా పడ్డాడు?
ఎక్కడ పడ్డాడు?
పక్కన ఎవరున్నారు?
ఎవరు చూశారు?
పడి ఏమి చేశాడు?

No comments:

Post a Comment