Monday, September 30, 2013

రాము చేసిన తప్పు

                                                                           కథ: రాధ మండువ
 చిత్రాలు: అడవి రాముడు
అభ్యాసము: అనురాధ కింతలి 
రోడ్డు మీద తలొంచుకుని నడిచి పోతున్న రాముని చూసింది బుజ్జి కుక్క పిల్ల.
"రామూ! రామూ! ఎక్కడికి వెళుతున్నావు?" అంది వాడి వెంట పడి.
"నేను అలిగి తోటకి వెళుతున్నా" అన్నాడు రాము.
"అలిగావా? ఎందుకు? ఎవరేమన్నారు? అంది కుక్కపిల్ల.


సమాధానం చెప్పకుండా "ఊ! ఊ!" అంటూ పెద్దగా ఏడుస్తూ ముందుకి నడిచాడు వాడు.
"అయ్యో! ఏడవొద్దు రామూ! ఏడవొద్దు" అంటూ రాము వెనకాలే నడవసాగింది అది కూడా 'కుయ్ కుయ్' మని మూలుగుతూ.
కొంత దూరం వెళ్ళేటప్పటికి వీళ్ళకి కాకి ఎదురు వచ్చింది. రాము ఏడవడం చూసి కుక్కపిల్లకి దగ్గరగా వాలి-
" ఏమయింది? ఎందుకు ఏడుస్తున్నాడు ?" అంది.
"రాము అలిగి తోటకి వెళుతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పలా" అంది కుక్క, గుసగుసగా.
కాకి ఏమీ మాట్లాడకుండా దిగులుగా చూస్తూ ఎగరసాగింది.


ఇంకొంత దూరం వెళ్ళేప్పటికి వీళ్ళకి పిల్లి ఎదురు వచ్చింది. ఏడుస్తున్న రాముని చూసి "అయ్యో! రామూ! ఎందుకు ఏడుస్తున్నావు?” అంది పెద్దగా కంగారు గొంతుతో. రాము సమాధానం చెప్పలేదు.
అదసలే వాగుడు పిల్లి. నోరు మూసుకుని ఉంటుందా? కుక్కపిల్ల వైపు తిరిగి "నువ్వయినా చెప్పు. రాము ఎందుకు ఏడుస్తున్నాడు? ఎక్కడికెళుతున్నాడు?" అని అడిగింది.
" అలిగి తోటకెళుతున్నాడు" అంది కుక్కపిల్ల చిన్నగా.
" ఎవరి మీద అలిగాడు? ఎందుకు అలిగాడు? నువ్వేమైనా అన్నావా? " అంది అరుస్తూ.
అది విన్న రాము ఇంకా పెద్దగా ఏడవసాగాడు.
" ష్! అబ్బబ్బ! ఈ వాగుడు పిల్లికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. నోరు మూసుకో " అంది కాకి. పిల్లి నోరు మూసుకుని రాము ముందుకి వచ్చి నడవసాగింది.



నలుగురూ తోట దగ్గరకి వచ్చారు. తోట బయట మామిడి చెట్టు మీద ఉన్న కోతి వీళ్ళను చూసి క్రిందికి దూకింది. రాము ఏడుపు ఆపి దాని వైపు చూశాడు.
"రాము ఎందుకు ఏడుస్తున్నాడు?" అంటూ పిల్లి వైపు చూసి, "ఈ వాగుడు పిల్లి ఏదో అని ఉంటుంది- అంతేనా?" అంది కోతి - నడుము మీద చెయ్యి పెట్టుకుని పిల్లిని చూస్తూ. ఆ మాటలు విన్న రాము మళ్ళీ ఏడుపు లంకించుకున్నాడు.





"మీ ఇద్దరూ ఇక్కడే తన్నుకుంటూ కూర్చోండి" అంటూ కుక్కపిల్ల రాము దగ్గరకి పరిగెత్తింది. కాకి కూడా విసుక్కుంటూ రాము దగ్గరకి ఎగిరింది. కోతీ, పిల్లీ నోళ్ళు మూసుకుని వారి వెంట తోటలోకి నడిచాయి.
జామ చెట్టు మీద ఉన్న రామచిలుక రాము ఏడవడం చూసి ఒక జామ పండుని తెచ్చి రాముకి ఇచ్చింది. రాము ఏడుపు ఆపి చెట్టుకింద కూర్చుని జామపండు తినసాగాడు. అన్నీ రాము చుట్టూ కూర్చున్నాయి.
అంతలో "రామూ! రామూ!" శీతల పెద్దగా కేకేస్తూ తోటలోకి వచ్చింది.
రామచిలుక శీతలకి కూడా జామపండు ఇస్తూ "ఎందుకు, రాము ఏడుస్తున్నాడు?" అంది.
"మరే! రాము పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్ళి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బంతి ఎత్తుకొచ్చాడు. అందుకని అమ్మ కొట్టింది" అంది శీతల.
"అమ్మో! దొంగతనం చేశావా?!" అంది వాగుడు పిల్లి.
"తప్పు కదూ!?" అంది కోతి.
రాము ఈసారి ఇంకా పెద్దగా వెక్కి వెక్కి ఏడవసాగాడు.
"ష్! అలా మాట్లాడకూడదు. మూడేళ్ళ బాబుకేం తెలుస్తుంది?! తెలియక చేసి ఉంటాడు-ఊరుకో!" అంది కుక్కపిల్ల.
"ఇంకెప్పుడూ అలా చేయడు! " అంది కాకి.



"ఏడవొద్దు రామూ. ఇంకొకరి వస్తువులు వాళ్ళకి తెలియకుండా తీసుకోకూడదని ఇప్పుడు తెలిసిందిగా., దా ఇంటికి పోదాం. ఇంకెప్పుడూ అలా చేయనని అమ్మతో చెబుదువుగాని దా!” అంది శీతల, తమ్ముడి భుజాన్ని పట్టి లేపుతూ.
రాము, శీతలతో కలిసి అన్నీఇంటికి వచ్చాయి.
"ఇంకెప్పుడూ ఇంకొకరి వస్తువులు తీసుకోనమ్మా!" అన్నాడు రాము అమ్మ మీదికి ఎక్కేసి ఏడుస్తూ.
అమ్మ రాముని ఎత్తుకుని, వాడి కళ్ళు తుడిచి ముద్దు పెట్టుకుంది.
కోతికి, కుక్కకి, పిల్లికి, కాకికి అందరికీ పాలు, పళ్ళు తెచ్చి ఇచ్చింది.




ఈ క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

1. రాము అలిగి ఎక్కడికి వెళుతున్నాడు?


2. రాము అలిగి వెళుతున్నప్పుడు ఎవరు రాము వెనుక వచ్చారు?


3. “మీ ఇద్దరూ ఇక్కడే తన్నుకుంటూ కూర్చోండి” అని ఎవరు అన్నారు?


4. రామచిలుక ఎక్కడ ఉన్నది?


5. రాము ఎందుకు ఏడుస్తున్నాడు?


6. అమ్మ రామూని ఎందుకు కొట్టిoది ?


7. శీతల ఏం అని చెప్పి రామూని ని ఇంటికి తీస్కువెల్లిoది?


8. రాము వాళ్ళమ్మకు ఏమి చెప్పాడు?



9. అమ్మ ఎవరెవరికి పాలు పళ్ళు ఇచ్చింది?



ఈ క్రింది వాటికి అర్ధాలు వ్రాయండి

1. Mother

2. Monkey

3. Crow

4. Cat

5. Dog

6. Parrot

7. Garden

8. Cry

9. Milk

10. Mango Tree

11. Guava Tree

12. Ball

13. Little Brother

14. Stealing


పదబంధం

రోడ్డు, రాము, కుక్క, తోటకి, కోతి, పిల్లి, కాకి, అమ్మ, జామ, మామిడి, కొట్టిoది, అలిగి,మూలుగు, గుసగుస, వాగుడు, పాలు, దొంగతనం, ఏడవొద్దు, ఏమయింది

స్ట్
మై
కో
టః
ఇం
వ్
సే
జా
స్తే
తి
ళీ
రా
క్ష్
లి
ఫో
జ్ఞ
మ్మ
తా
ద్దు
క్
సే
స్మ
డి
అం
కా
దొం
వొ
డా
తో
జు
యే
మి
శు
డా
డు
ఫో
మా
స్ట
గి
తు
వా
కా
కి
యొ
గు
ల్లి
గు
లు
యా
గ్
నం
హ్
రా
అం
పి
లు
చి
ద్
హం
లి
గి
వా
గు
డు
ను
మూ
పా
క్క
జ్
బం
గ్
ట్
రా
కీ
కు
కా
డ్డు
ఫ్
య్
రం
చు
యా
తా
యే
ల్
ణ్
రో
రా
ము
కొ
ట్టి౦
ది
రూ
యిం
ది
ద్
యిం


2 comments:

  1. టైటిల్ ఒక సారి సరి చేసుకోండి జ్యోతిర్మయి గారు,
    క్షమించండి,

    ReplyDelete
    Replies
    1. అయ్యో క్షమించడం ఎందుకండి. నేను చూసుకోలేదు. థాంక్యు. మీ పేరు చెపితే బావుండేది.

      Delete