Friday, October 4, 2013

ఏం తింటారు?

రచన: రాధ మండువ, 
 బొమ్మలు: అడవి రాముడు
అభ్యాసము: అనురాధ కింతలి 

ఒక అడవిలో ఒక బుల్లి కుందేలు ఉండేది. అది చాలా తెలివైనది. అడవిలో ఉండే అన్ని విషయాలూ దానికే కావాలి. ఒకరోజు పగలంతా అడవిలో తిరిగి తిరిగి అలిసిపోయిన అది భోజనం కూడా చేయకుండా నిద్రపోయింది. తినకుండా పడుకోవడం వల్లేమో దానికి ఆ రాత్రంతా తిండి గురించిన కలలే. తెల్లవారి నిద్ర లేచిన కుందేలుకి బాగా ఆకలయింది. తన అమ్మకి కూడా చెప్పకుండా బయటకి వెళ్ళి కొన్ని దుంపలు వెతుక్కుని తినసాగింది. 


తింటుండగా దానికి ఒక సందేహం కలిగింది. నాకు ఆకలయితే దుంపలు తింటాను కదా! మరి అడవిలోని మిగతా జంతువులు ఏం తింటాయి? అని అనుకుంది. అనుకున్నదే ఆలశ్యం తినే తినే దుంపలని వదిలేసి అడవిలోకి పరిగెత్తింది. చెంగు చెంగున గెంతుకుంటూ వెళుతున్నకుందేలుకి బుల్లి తాబేలు ఎదురొచ్చింది.


    
"తాబేలూ, తాబేలూ! నీకు ఆకలయితే ఏం తింటావు?" అని అడిగింది. "నేను ఆకుకూరలు, దుంపలు, కొన్నిరకాల మొక్కలు, పళ్ళు తింటాను" అంది తాబేలు.
"అరె! నేను కూడా నువ్వు తినేవే తింటాను మరి నువ్వెందుకు నాలాగా పరిగెత్తలేవు?" అంది కుందేలు.
"నిదానమే ప్రధానం అని మా అమ్మ చెప్పింది" అంటూ దాని దారిన అది పోయింది. 



కుందేలుకి ఆ మాటలు నచ్చలేదు. అది ముందుకు పరిగెత్తింది. కొంచెం దూరంలోనే దానికి ఏనుగు పిల్ల కనిపించింది. కుందేలు ఏనుగుని ఆపి "ఏనుగూ, ఏనుగూ!నీకు ఆకలయితే ఏం తింటావు?" అని అడిగింది.


"నాకు ఆకలైతే మంచి చెరుకుగడలు నాలుగు నములుతాను" అని చెప్పింది ఏనుగు. చెరుకు గడలు అనగానే కుందేలుకి నోరూరింది. అది ప్రక్కనే ఉన్న చెరుకు తోటలోకి వెళ్ళి ఒక చెరుకుని కోసి తినబోయింది కాని దానికి చెరుకుని ఎలా తినాలో తెలియలేదు. ఈలోగా ఆ ఏనుగు పిల్ల గునగునా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.



కుందేలు చెరుకుని అక్కడే పారేసి ముందుకు నాలుగు అడుగులు వేసే సరికి దానికి ఒక చీమ కనిపించింది. "చీమా, చీమా! ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటావే - ఆగు ఆగు" అంది. చీమ కుందేలుని చూసి విసుగ్గా ముఖం పెట్టి
"ఏమిటో త్వరగా చెప్పు. అవతల నాకు చాలా పని ఉంది" అంది చీమ.
"నీకు ఆకలయితే ఏం తింటావు?" అని అడిగింది కుందేలు.
"పప్పులూ, పండ్లు, తీపి పదార్థాలు అన్నీ తింటాను.నాకు తీపి పదార్థాలంటే చాలా ఇష్టం" అంటూ చీమ ముందుకి వెళ్ళింది.
బుల్లి కుందేలుకి కూడా తీపిగా ఏదైనా తినాలనిపించింది. తీపి పదార్థాల గురించి ఆలోచించుకుంటూ ముందుకి నడుస్తున్న కుందేలు బాట ప్రక్కన నిలబడి ఉన్న ఎలుగుబంటుని చూసింది.
"ఎలుగూ! నీకు ఆకలయితే ఏం తింటావు?" అని అడిగింది. 
"చేపలు, మాంసం, కూరగాయలు అన్నీ తింటాను. తేనె కూడా తింటాను. ఇప్పుడే తేనెని తిని వస్తున్నా" అంది ఎలుగుబంటు.



"తేనె అంటే నాకూ ఇష్టమే కాని తేనె తింటే బొజ్జ నొప్పి వస్తుందని మా అమ్మ చెప్పింది" అంది కుందేలు మూతి ముడుచుకుని.కుందేలు మాటలకి ఎలుగుబంటు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
ఎలుగుబంటు అటు వెళ్ళగానే తీపిగా తేనెని తినాలనుకున్నబుల్లి కుందేలు అక్కడున్న ఒక పెద్ద కర్రతీసుకుని చెట్టు కొమ్మకున్నతేనె తుట్టెని కదిలించింది. తేనెటీగలు ఝుమ్మని ఎగురుతూ కుందేలు పైన దాడి చేశాయి.

బెదిరిపోయిన కుందేలు"అమ్మోయ్! బాబోయ్!అని అరుచుకుంటూ ఇంటికి పరుగు పెట్టింది. స్నానం చేసి అమ్మ పెట్టినదుంపలు తిని అమ్మ ప్రక్కనపడుకుని ఆరోజు తను తెలుసుకున్న విషయాలన్నీ అమ్మకి చెప్పింది. అమ్మ తన కొడుకు తెలివితేటలకి నవ్వుకుంది.




 ఈ క్రింది ప్రశ్నలకు జావబులిమ్ము 



1. అలిసిపోయి పడుకోవడం వలన కుందేలు కి ఏం కలలు వచ్చాయి?



2. కుందేలు కి ఏం సందేహం కలిగింది?



3. తాబేలు ఏమి తింటుంది?



4. ఏనుగు ఏమి తింటుంది?



5. చీమ ఏమి తింటుంది?



6. ఎలుగుబంటి ఏమి తింటుంది?



7. కుందేలు వాళ్ళమ్మ తేనె తింటే ఏం అవుతుందని చెప్పింది?



8. కుందేలు ఎందుకు బెదిరి పోయింది?



9. కుందేలు వాళ్ళమ్మ ఎందుకు నవ్వింది?



10. ఎలుగుబంటి ఏమన్నది? 





ఈ క్రింది ప్రశ్నలకు సరియైన సామాధానం వ్రాయండి. 


1.కుందేలు మీద ఏవి దాడి చేశాయి? 

         1.తేనెటీగలు 2. దోమలు 3. చీమలు 


2. కుందేలు తేనె తుట్టెను దేనితో కదిలించింది? 

         1.పుల్ల 2. చీపురు 3. పెద్ద కర్ర 4. చిన్న కర్ర 


3. ఏనుగు ఏమి తింటుంది?

         1.శనగలు 2. తీపి పదార్ధాలు 3. చెరుకు గడలు,


4. కుందేలు ఏమి చెయ్యకుండా నిద్ర పోయింది?

        1. స్నానం 2. భోజనం 3. చదువుకోవడం 


5. ఆకుకూర ఎవరు తింటారు?

         1. తాబేలు 2. ఏనుగు 3. చీమ




పదబంధం 

డ్లు
పే
మా
గు
ళ్
చే
పం
లు
వి 
తె
లౌ
కా
షి
సు
లి
లి
బా
లు
డు
డు
కు
సే
వి
మో
వై
టి
యో
ము
బె
లో
దుం
జు
కే
బం
సో
ప్ర
ఖు
ది
గు
జ్
ది
లూ
వి
కుo
దే
లు
ఛి
గో
సు
న్
లు
హం
హం
ర్
చీ
ను
దే
డే
ష్
పు
ము
సం
స్ర్



అడవికుందేలు, తెలివి, సందేహం, చీమ, ఎలుగుబంటి, మాట, బాలుడు, సోది, అర, ఎలుకచేపలు, పండ్లు, దుంపలు, ఋషి, సేవకుడు, జయము, సుమన్, చీర, నులక, పురము, నగ

No comments:

Post a Comment