Wednesday, September 11, 2013

నూతన సభ్యులకు స్వాగతం

పిల్లలకు తెలుగు నేర్పించాలన్న మీ అభిలాష నెరవేరుతుందని ఆశిస్తాను. మీకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలందించడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా వున్నారు. ఈ ఆదివారం నుండి తెలుగు తరగతులు ప్రారంభమౌతాయి. 

పిల్లలకు మన మాతృభాషను నేర్పిస్తూ, వారిలో మంచి భావాలను పెంపొందిస్తూ, భవితను ముందుకు నడిపించడమే పాఠశాల ముఖ్యోద్దేశ్యం. పాఠశాల మొదలు పెట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగు సంవత్సరాల్లో ఎంతోమంది పిల్లలు తెలుగు చదవడం రాయడం నేర్చుకున్నారు. కొంతమంది ఉత్తరాలు వ్రాసే స్థాయికి కూడా రావడం చాలా సంతోషకరమైన విషయం. వారీ స్థాయికి చేరుకోవడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో ఉంది. వారందరకీ నా అభినందనలు. మనకున్న అదృష్టం ఏమిటంటే మన ఉపాధ్యాయులు. నిస్పక్షపాతంగా, నిబద్దతతో, నిస్సార్ధంగా పనిచేస్తున్న ఈ ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పినా తక్కువే.

తెలుగులో ఒక్క పదం కూడా పలుకలేని పిల్లలతో తెలుగులోమాట్లాడించి రూపొంచిన మా తొలి నాటిక ఉగాది వేడుకలు 
దసరా పండుగ విశిష్టతను తెలియజేసే మరో నాటిక  దసరా సంబరాలు
తెలుగు భాషాభివృద్ది గురించి వేసిన నాటిక అమ్మమ్మ గారూ అమెరికా ప్రయాణం  
"తెలుగు అసలు ఎందుకు నేర్చుకోవాలి?" అనే ప్రశ్నకు సమాధానమే   roots 
ఇక పోయినేడాది వార్షికోత్సవం సందర్భంగా పిల్లలు వేసిన నాటికలు  శరీర అవయవాలు నీతి కథలు.  
గత మూడు సంవత్సరాలుగా టిఏజిసిఏ వేదిక మీద ప్రార్ధనా గీతాన్ని మన పాఠశాల విద్యార్ధులే పాడుతున్నారు. అందులో ఒకటి ఈ తేనెల తేటల మాటలతో
పోయిన సంవత్సరం వినాయక చవితికి పిల్లలే స్వయంగా విగ్రహాలు 
తాయారు చేశారు.
అంతకుముందు సంవత్సరం నవరాత్రులకు పిల్లలు చేసిన బొమ్మలతోనే బొమ్మల కొలువు పెట్టాము. 
ఇలాంటివో మరెన్నో...

ఇవన్నీ పిల్లలు తెలుగు నేర్చుకోవడానికి, వారికి భాష పట్ల ఆసక్తి  కలిగించడానికి, మన సంస్కృతిని వారికి పరిచయం చెయ్యడానికి చేసినవి. ఇకముందు చేయబోయే కార్యక్రమాలలో మీరు కూడా భాగం పంచుకుంటారని ఆశిస్తున్నాను. 

మీకు తెలుగులో  టైప్ చెయ్యాలని ఆసక్తిగా ఉందా! అయితే ఇలా ప్రయత్నించండి.

2 comments: