Tuesday, August 13, 2013

సింహం-కుందేలు

ఒక అడవిలో ఒక మృగరాజు(king of forest) ఉండేది. అది అడవిలో అన్ని జంతువులని వేటాడి(hunting)తింటూ ఉండేది. అప్పుడు జంతువులన్నీ వచ్చి " ఓ మృగరాజా, మమ్మల్ని అందర్నీ ఇలా వేటాడుతూ పొతే కొన్ని రోజులకి మేము అంతరించి పోతాము(disappear/vanish). తరువాత మీకు ఆహారం దొరకడం కష్టం అవుతుంది. అందుకని మేమే రోజుకి ఒకరం చొప్పున వచ్చి మీకు ఆహరం అవుతాము అన్నాయి. " దానికి సింహం ఆలోచించి "ఈ పరుగులెత్తి, జంతువులని కాపు కాసి(hiding behind the bushes and waiting for the animals to come) వేటాడే కంటే ఇదే నయం అనుకుని" సరే అంది.

ఇలా ఉండగా ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. దానికి సింహం దగ్గరికి వెళ్లి ఆహరం అవ్వడం ఇష్టం లేదు. ఏమి చేద్దామా అని ఒక ఉపాయం(idea) ఆలోచించింది. కావాలనే సింహం దగ్గరికి ఒక అరగంట ఆలస్యంగా(late) వెళ్ళింది.

సింహం అప్పటికే ఆకలితో , కోపంగా ఎదురుచూస్తోంది(waiting). కుందేలు వెంటనే వెళ్లి  "మృగరాజా క్షమించండి(forgive) దారిలో నేను వస్తుంటే అచ్చంగా మీలానే(exactly like you)ఉన్న సింహం ఒకటి కనపడింది. దాని నుండి తప్పించుకుని వచ్చేసరికి ఆలస్యం అయ్యింది" అంది. దానికి మృగరాజు కోపంగా " నాలానే ఇంకొకరు ఉన్నారా ఈ అడవిలో(within this forest) ఏదీ దాన్ని నాకు చూపించు" అంది. సరేనని కుందేలు సింహాన్ని ఒక నూతి(well with water) దగ్గరికి తీసుకు వెళ్లి చూపించింది. సింహం అసలే కోపంగా ఉండటం తో అది తన నీడ(shadow) నీటిలో చూసి, ఇంకొక సింహం నూతిలో ఉందని భ్రమించి,(delusion/ misapprehension) "నీ అంతు చూస్తా ఉండు" అంటూ నూతిలోకి దూకింది. తరువాత ఈత రాక పైకి వచ్చే దారిలేక నీటిలో మునిగిపోయింది. కుందేలు సంతోషంగా అడవిలోకి పరుగు తీసింది.



1. మృగరాజు అంటే ఎవరు?

2. జంతువులూ మృగరాజు తో చేసిన ఒప్పందం ఏమిటి?

౩. కుందేలు తన వంతు వచ్చినప్పుడు ఏమి చేసింది?

4. అరగంట అంటే ఎంత?

5. సింహం నూతి లోకి ఎందుకు దూకింది?

6. కధ లోని నీతి ఏమిటి?



ఈ క్రింది ఖాళీలు పూరించండి

1. మృగరాజు అడవిలో అన్ని ---------------------- వేటాడి తింటూ ఉండేది.

2. కుందేలుకి సింహం దగ్గరికి వెళ్లి _______________________అవ్వడం ఇష్టం లేదు.

౩. కుందేలు వెళ్లేసరికి సింహం ------------ తో, ------------- గా ఎదురు చూస్తోంది.

4. సింహం నీటిలో తన ------------- చూసింది .



కధలో ఈ క్రింది వాటికి తెలుగు పదాలు ఉన్నాయి. అవి రాయండి.

idea ------------ forest---------- shadow ----------

wait ------------ forgive------------- hunting----------



ఈ కథను బ్లాగులో పెట్టిన రాధ గారికి ధన్యవాదములు.

3 comments:

  1. Radha garu and Jyothi garu this story and it's activities both are good. My son Praveen enjoyed it. He was able to read it fluently and understood the meaning of words.
    Thanks
    Anuradha

    ReplyDelete
  2. ఈ కథని మన పిల్లలు క్రిందటి సంవత్సరం stage మీద act చేశారు కదా.. అందుకే ఇంకా బాగా enjoy చేస్తున్నారు.. థాంక్స్ రాధా

    లావణ్య

    ReplyDelete
  3. Jyoti
    Could you please add an English word "wait"next to "ఎదురు"in this story, 3rd paragraph, first line.

    thanks
    Radha

    ReplyDelete