Sunday, September 8, 2013

ఒత్తులు

క + క  = క్క,   ఖ + ఖ = ఖ్ఖ,  గ + గ =  గ్గ, ఘ + ఘ =  ఘ్ఘ,  ఙ్ఙ 

చ + చ = చ్చ,  ఛ + ఛ = ఛ్ఛ, జ + జ =  జ్జ, ఝ + ఝ =  ఝ్ఝ, ఞ్ఞ

ట + ట = ట్ట,  ఠ + ఠ = ఠ్ఠ,  డ + డ = డ్డ,  ఢ + ఢ = ఢ్ఢ,  ణ + ణ = ణ్ణ

త + త = త్త, థ + థ =  థ్థ, ద + ద = ద్ద, ధ + ధ =  ధ్ధ,  న + న = న్న

ప + ప = ప్ప, ఫ + ఫ =  ఫ్ఫ, బ + బ = బ్బ, భ + భ = భ్భ, మ + మ = మ్మ

య + య = య్య, ర + ర =  ర్ర, ల + ల = ల్ల,  వ + వ = వ్వ,


శ + శ =  శ్శ, ష + ష =  ష్ష, స + స =  స్స, హ + హ = హ్హ

ళ + ళ = ళ్ళ ఱ + ఱ = ఱ్ఱ



 ఈ క్రింది అక్షరాలకు ఒత్తు అక్షరం క్రింద ఇస్తాము. 

ఖ్ఖ, గ్గ, ఘ్ఘ, ఙ్ఙ 

జ్జ, ఝ్ఝ, ఞ్ఞ

ట్ట, ఠ్ఠ, డ్డ, ఢ్ఢ, ణ్ణ

త్త, థ్థ, ద్ద, ధ్ధ,  

ర్ర, ల్ల, ష్ష, హ్హ, ఱ్ఱ



ఈ క్రింది అక్షరాలకు ఒత్తు పక్కన ఇస్తాము.

క్క, చ్చ, ఛ్ఛ, న్న, ప్ప, ఫ్ఫ, బ్బ, భ్భ, మ్మ, య్య, వ్వ, శ్శ, స్సళ్ళ


ద్విత్వాక్షరాలు: పైన చెప్పినవన్నీ ద్విత్వాక్షరాలు అంటే ఒక అక్షరమునకు అదే అక్షరము ఒత్తు ఇస్తే అది ద్విత్వాక్షర౦ అంటాము.


సంయుక్తాక్షరాలు: ఒక అక్షరమునకు వేరొక అక్షరము ఒత్తు ఇస్తే దానిని సంయుక్తాక్షరము అంటాము.

ఉదా: సత్య, వార్త, ముద్ర
త + య = త్య, ర + త = ర్త, ద + ర = ద్ర

సంశ్లేషాక్షరాలు: ఒక అక్షరమునకు రెండు ఒత్తులు ఇచ్చినప్పుడు అది సంశ్లేషాక్షర౦ అవుతుంది. మత్స్య యంత్రం, అర్ఘ్యము, రాష్ట్రము

త + స + య = త్స్య, ర + ఘ+ య = ర్ఘ్య, ష + ట + ర = ష్ట్ర


4 comments:

  1. జ్యోతిర్మయి గారికి నమస్కారం. చాల చక్కగా వుంది మీ పాఠశాల. చాల రోజుల తరువాత మళ్ళీ సందర్శించాను. ఈ పోస్టులో.. ఒక అక్షరమునకు అదే అక్షరము వత్తుగా వస్తే దానిని "ద్విత్వము" అంటారు. ద్విక్తము కాదనుకుంటాను. దీనిని సంధులలో ద్విరుక్తము అని సంబోధించడం కూడ జరుగుతుంది. అంటే రెండుసార్లు (ఒకదాని క్రింద మరొకటి వత్తుగా రావడం) ఉదాహరణకు ద్విరుక్తటకార సంధి (ఉ.దా. కట్టెదుట, చిట్టెలుక మొదలయినవి), అంటే ట కు ట వత్తుగా రావడం. దీని సంధి సూత్రం కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దంబుల ర, డ లకు అచ్చు పరమైనపుడూ ద్విరుక్తటకారంబగు. అందువలన ద్విత్వము గాని ద్విరుక్తము గాని అవుతుందని నా అభిప్రాయం. సరిచూడగలరు.

    ReplyDelete
    Replies
    1. సూర్యనారాయణ గారు మార్చానండి. మీరు సరిచేయకపోతే పిల్లలకు అవే నేర్పించేవాళ్ళం. ధన్యవాదాలు.

      Delete
    2. జ్యోతిర్మయి గారు, ధన్యవాదాలు. ఏదో ఆలోచిస్తుంటే మరొక సందేహం కలిగింది. అన్యధా భావించవలదు. ఎందుకంటే నేను కూడ మా వూరి తెలుగు బడిలో బోధిస్తున్నాను. వత్తులు కాక ఒత్తులని అనుకుంటాను. వత్తి ప్రమిదలలో వేసేది. హిందీలో బత్తి అంటారు. దీపం వెలిగించడానికి వాడేది. విక్ అని ఆంగ్లంలో అంటాము. నిజానికి వీటిని వొత్తులు అంటారు. ఉదా.కొవ్వొత్తి. హిందీలో మూంబత్తి. ఒత్తి అంటే ఒత్తి పలికేది అంటే నొక్కి పలికేది. ఉదా క ఒత్తు, మ ఒత్తు. నేను పొరబడి వుండవచ్చు. మీ అభిప్రాయం తెలుపగలరు.

      Delete
    3. సూర్యనారాయణ గారు మీరు చెప్పింది సరైనదేనండి. మార్చాను.
      అనుకోవడం ఏమీ లేదండి. మీరిలా చెప్పడం వలన పిల్లలకు సరిగ్గా నేర్పించగలుగుతున్నాము. ఇంత శ్రద్దగా సరిచేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

      Delete