Tuesday, August 13, 2013

మంచి పని

ఒక ఉరిలో ప్రసాద్ అనే అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ నాన్నగారు " ప్రసాద్ నేను పూజలో ఉన్నాను. ఇంట్లో దేవుడికి నైవేద్యం(offering) పెట్టడానికి పండ్లు ఏమి లేవు. పక్కనే ఉన్న కొట్టుకి వెళ్లి కొన్ని అరటి పళ్ళు పట్టుకురా" అని చెప్పారు.

సరే అని ప్రసాద్ కొట్టుకి(small shop) వెళ్లి ఒక అరడజను(half a dozen) అరటి పళ్ళు కొని ఇంటికి తీసుకుని వెడుతుంటే.. దారిలో ఒక చిన్న పిల్లవాడు , వాళ్ళ అమ్మ కనిపించారు. వాళ్ళు చాలా దిగులుగా ఒక పక్కన కూర్చుని ఉన్నారు. ప్రసాద్ చేతిలో అరటి పళ్ళు చూసి ఆ పిల్లవాడు “నాకు అరటి పండు కావాలి, ఆకలిగా ఉంది” అని గొడవ చేసాడు.

ప్రసాద్ వారి దగ్గరికి వెడితే తనకి అర్ధమయ్యింది. వాళ్ళు చాలా పేదరికం(poverty) లో ఉన్నారు ఏమి తినలేదని.వెంటనే తన చేతిలో ఉన్న పళ్ళు ఆ పిల్లవాడికి ఇచ్చి ఇంటికి వెళ్ళాడు.

ఇంటికి వెళ్ళాక పండ్లు కొని ఎవరికో ఇచ్చి వచ్చాను అంటే వాళ్ళ నాన్నగారు తిడతారని ఒక తలుపు వెనకాల నుంచుని(standing behind the door) వాళ్ళ నాన్నగారు అడిగితే “ఏమి సమాధానం చెప్పాలా” అని ఆలోచిస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు ప్రసాద్ ని చూసి, “ఏమిట్రా దాక్కున్నావు(why are you hiding), అరటి పండ్లు ఏవి?” అని అడిగారు. ప్రసాద్ జరిగింది వివరంగా చెప్పంగానే వాళ్ళ నాన్నగారు ప్రసాద్ ని చూసి, “నువ్వు చాలా మంచి పని చేసావు.నాకు నిన్ను చూస్తుంటే చాలా గర్వం(proud) గా ఉంది” అని మెచ్చుకున్నారు(appreciate).



ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

1. ప్రసాద్ వాళ్ళ నాన్నగారు ప్రసాద్ కి ఏమి పని చెప్పారు?

2. ప్రసాద్ కి దారిలో ఎవరు కనిపించారు?

౩. ప్రసాద్ అరటి పళ్ళు ఎవరికి ఇచ్చాడు?

4. అరడజను అంటే ఎంత?

5.ప్రసాద్ వాళ్ళ నాన్నగారు ప్రసాద్ ని ఏమని మెచ్చుకున్నారు?


6. కధ వల్ల మీకు ఏమి అర్ధమయ్యింది?


ఈ క్రింది ప్రశ్నలకి మీ సమాధానం ఇవ్వండి.


1.మీరు మీ నాన్నగారు చెప్పిన పని చేస్తారా? ఏమి పని చేసారు ఒకటి చెప్పండి?

2.మీరు ఎప్పుడేనా ఎవరికేనా సహాయం చేసారా? ఎలా చేసారు?వివరించండి?
ఈ క్రింది ఖాళీలు పూరించండి.

1. ప్రసాద్ కొట్టుకి వెళ్లి ____________________ తెచ్చాడు.

2.ప్రసాద్ వాళ్ళ నాన్నగారు దేవుడి-------------------- కోసము అరటిపండ్లు తెమ్మన్నారు.

౩. ప్రసాద్ ------------------ వెనకాల దాక్కున్నాడు. 

4. ప్రసాద్ ఇంటికి వస్తుంటే ----------------, వాళ్ళ------------------- కనిపించారు.

ఈ క్రింది వాటికి కధలో ఉన్న తెలుగు మాటలు వ్రాయండి.

Father---------------- behind the door-----------------

shop------------------ Bananas------------------------

god------------------- Proud--------------------------


కథ అభ్యాసము: రాధ వేలూరి.

No comments:

Post a Comment