Tuesday, August 6, 2013

ఖాండవ దహనం

అమెరికా లో WILD FIRES గురించి వినే ఉంటారు. మన పురాణాల్లో కూడా అలాంటి కధే ఒకటి ఉంది.

ఒకప్పుడు శ్రీ కృష్ణుడు, అర్జునుడు ఖాండవ వనం (kHandava forest) దగ్గర సంచరిస్తూ(to wander/ walk around)ఉండగా, ఒక బ్రహ్మణుడు వారి దగ్గరికి వచ్చాడు. "అర్జునా, నాకు మీ నుండి ఒక సహాయం కావాలి, నన్ను అనుగ్రహించండి"(please show your kindness/ do me a favor) అని బ్రతిమలాడాడు. అర్జునుడు "నా సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది" అని ఆ బ్రాహ్మణుడికి అభయం (promise/ assurance to protect)ఇచ్చాడు. అభయం ఇచ్చిన వెంటనే ఆ బ్రాహ్మణుడు అగ్నిదేవుడి(god of fire) రూపం లోకి మారాడు. "అర్జునా, మారు వేషం లో వచ్చి మిమ్మల్ని సహాయం కోరాను. నేను ఈ ఖాండవ వనాన్ని దహించాలి(burn) అందుకు మీ సహాయం కావాలి" అని అడిగాడు.

అర్జునుడు ఆశ్చర్యపడి, "ఈ పచ్చని వనాన్ని దహించవలసిన కారణమేమిటి?" అని అడిగాడు. అందుకు అగ్ని దేవుడు, "ఒకప్పుడు శ్వేతకి అనే రాజు వంద ఏళ్ళ పాటు ఒక యాగం చేసి నాకు హోమంలో ఆవు నెయ్యి సమర్పించేవాడు(he use to offer). వంద ఏళ్ళపాటు ఆ స్వచ్చమైన నెయ్యి తిని తిని నాకు అజీర్ణం(indigestion) పట్టుకుంది . ఈ అడవిలో చాల రకమైన ఔషధ వృక్షాలు ఉన్నాయి. నేను వాటిని సేవిస్తే నా అజీర్తి నయమవుతుంది(will be cured). కానీ ఇంద్రుడి స్నేహితుడు , నాగరాజు తక్షకుడు ఈ అడవిలో ఉంటాడు. అందువల్ల ఇంద్రుడు నన్ను ఈ అడవిని దహించకుండా అడ్డు పడుతున్నాడు" అని చెప్తాడు.

అర్జునుడు అగ్నిదేవుడితో "నీవు అడవిని దహించు. నిన్ను ఎవరు ఆపకుండా నేను చూస్తాను" అన్నాడు. అగ్ని శరవేగం(rapidly) తో అడవిని దహించడం మొదలు పెట్టాడు. అది చూసి ఇంద్రుడు కుంభవృష్టి కురిపిస్తే(to shower heavy and continuous rain), అర్జునుడు అడవి అంతటికి బాణాలతో గొడుగు లాగ కట్టాడు. అడవిని దహించకుండా ఆపడానికి ఇంద్రుడికి , అర్జునుడికి మధ్య భీకర మైన పోరు(dreadful/terrific fight) సాగింది. అప్పుడు ఇంద్రుడి కి స్వర్గం నుండి ఒక దివ్య వాణి (divine voice/God's voice)వినిపించి "ఇంద్రా, తక్షకుడు( takshaka is a name/king of snakes) క్షేమంగా(is safe) ఉన్నాడు. నర నారాయణులతో నెగ్గ లేవు (can't win with arjuna and srikrishna), ఇక పోరు(fight) ఆపు" అని హెచ్చరించింది.


ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

1. బ్రాహ్మణుడి రూపంలో అర్జునిడి దగ్గరికి ఎవరు వచ్చారు.?


2. అగ్నిదేవుడి  అడవిని దహించడానికి చెప్పిన  కారణ మేమిటి?


౩. ఇంద్రుడి స్నేహితుడు ఎవరు? ఎక్కడ ఉంటాడు?


4. దహించడం అంటే ఏమిటి?


5. స్వర్గం నుండి ఇంద్రుడికి వినిపించిన దివ్యవాణి ఏమిటి?


కధలో ఈ పాత్రలు పేర్లు పూరించండి.

అ----- నుడు,    ఇం----డు,   కృ-----డు,   ---గ్ని, త---కుడు

ఈ క్రింది ఖాళీలు పూరించండి

1.కృష్ణుడు, అర్జునుడు -------------------వనం దగ్గర ఉన్నారు.

2 అర్జునుడు -------------- కి అభయ మిచ్చాడు.

౩. పోరు అంటే ?

        1. యుద్ధం  2. వెళ్ళిపోవడం ౩. స్నేహం 4. ధైర్యం

4. కుంభవృష్టి  అంటే

       1. పెద్ద వాన 2. చినుకులు ౩.మంచు 4. ఎండలు

5 ఇంద్రుడి స్నేహితుడు పేరు ?

       1. కృష్ణుడు 2 అర్జునుడు ౩. తక్షకుడు 4.అగ్ని
 

 కథ, అభ్యాసము పంపిన వారు రాధ వేలూరి.

No comments:

Post a Comment