Monday, May 20, 2013

సరదా ఆటలు

  1. ఒక డబ్బాలో జంతువుల బొమ్మలు వేసి ఒక్కొక్కటి తీసి వాటి పేర్లు తెలుగులో చెప్పమనాలి. కూరగాయలు, పక్షులు, పండ్లు ఇవన్నీ కూడా ఇలాగే ఆటలాగే నేర్పిస్తే బావుంటుంది. 
  2. రకరకాల పువ్వుల బొమ్మలను ఒక డబ్బాలో వేసి ఆ పువ్వుల రంగులు చెప్పమనాలి. 
  3. చిన్న చిన్న చీటీల మీద అంకెలు రాసి ఒక డబ్బాలో వేసి పిల్లలను బయటకు తీయమని వాటిని తెలుగులో చెప్పమనాలి. అప్పుడే ఒకటి, ఒక్కరు, రెండు, ఇద్దరు....ఈ తేడాలు చెప్పాలి. 
  4. తెలుగు వంటలు బొమ్మలు అతికించిన పేపర్లను డబ్బాలో వేసి బయటకు తీసి వాటి పేర్లు చెప్పమనాలి. 
  5. తరగతిలో పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కో రంగు కాగితము పట్టుకోవాలి. ఒక్కరిని ఆ రంగుల పేర్లు చెప్పమనాలి. వారి వరుసక్రమము మారుస్తూ అందరితో ఆ రంగులు చెప్పించాలి. 
  6. ఒక డబ్బాలో కొన్ని వస్తువులు ఉంచి ఒక్కొక్కటి పైకి తీసి వాటి పేరు, ఉపయోగాలు చెప్పించడం. 
  7. కారు, రోడ్డు పదాలు ఇచ్చి కింద, పైన, పక్కన, వెనుక ఇలా రకరకాలుగా చెప్పించాలి. ఉదా: కారు రోడ్డు కింద వెళ్తుంది, రోడ్డు పక్కన చెట్టుంది. .....

  8. ఒకరు చేసే అభినయాన్ని మిగిలిన వారు వాక్యాలలో చెప్పాలి. (డంషార్ ఆర్ట్స్). వరుస ప్రకారం వెళితే అందరికీ అవకాశం వస్తుంది. 
  9. బొమ్మలు వరుసగా పెట్టి కథ చెప్పమానాలి.(గూగుల్ లో ఈ బొమ్మలు దొరుకుతాయమో చూడాలి) 
  10. ముక్కు, నోరు, చెవులు, చేతులు, కళ్ళు, కాళ్ళు, వేళ్ళు... తెలుగులో వీటి గురించి చెప్పించాలి.
  11. ఏదైనా చిత్రాన్ని చూపించి అందులో ఉన్న వస్తువుల పేర్లు చెప్పాలి. అప్పుడే రంగు, ఆకారం, రుచి వారితోనే చెప్పించొచ్చు.
  12. చిన్న కథలు తీసుకుని పిల్లలతో నాటిక వేయించాలి. ముందు వారాలలో వాటి సంభాషణలు ఇచ్చి పరీక్ష తరువాత నాటిక వేయించాలి.
  13. ప్రశ్నార్ధకాలతో కథ.





  • స్క్రాప్ బుక్ చెయ్యాలి అంటే పండ్లు, కూరగాయలు, రంగులతో పుస్తకం చేయాలి.
  • వంశవృక్షం వ్రాయాలి, ఇంటిలోవారి పేర్లు వరుసలతో వ్రాయాలి. 
  • బింగో ఆట అక్షరాలతో......
  • ఉత్తరం వ్రాయించాలి. 
  • No comments:

    Post a Comment