Wednesday, May 22, 2013

తాబేలు-కుందేలు

      ఒక అడవి లో ఒక కుందేలు ఉండేది. అది చాల అహంకారి. తనతో సమానంగా పరుగులు తీయమంటూ అందరితో పందాలు కాసేది. మడుగులో ఉండే తాబేలంటే దానికి చాలా అలుసు. ఒకరోజు తనతో పరుగు పందెం కాయమని ఎగతాళి చేసింది. ఈ చెరువు నుంచి ఆ కొండ వరకూ ముందుగా చేరిన వారిదే గెలుపు అని చెప్పింది. అందుకు తాబేలు అంగీకరించింది. 

      తాబేలు, కుందేలు బయలుదేరాయి. కుందేలు వాయువేగం తో ముందుకు సాగి కొండకు కొంత దూరం లో ఉండగా వెనుదిరిగి చూసింది . కనుచూపు మేర లో తాబేలు కనిపించలేదు. "ఇంకా తాబేలు రాదులే, చాలా ఎండగా ఉంది. కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాను" అని మెల్లగా నిద్రలోకి జారుకుంది. తను నిద్ర లో ఉండగా తాబేలు మెల్లగా నడుస్తూ కొండ చేరుకుంది. కుందేలు లేచి చూసేసరికి తాబేలు విజయం సాధించింది. 
     
     కుందేలు అవమానం తో తల దించుకుని ఇంక ఎన్నడూ పందాలు కట్టటం, ఎగతాళి చేయటం మానేసింది. 

ఈ కథను ఇక్కడ వినొచ్చు.


***క్రింది ఖాళీలను పూరించండి:

1. కుందేలు చాలా -------------------. 


2. ఈ చెరువు నుంచి ఆ ----------- వరకూ ముందుగా చేరిన వారిదే గెలుపు అని చెప్పింది.


3. ---------------మెల్లగా నడుస్తూ కొండ చేరుకుంది. 


4. కుందేలు లేచి చూసేసరికి తాబేలు ------------ సాధించింది.


5.---------------కుందేలు అవమానం తో తల దించుకుంది.


******క్రింది జవాబుకు ప్రశ్న వ్రాయండి :

1. కుందేలు తనతో సమానంగా పరుగులు తీయమంటూ అందరితో పందాలు కాసేది.


2. చెరువు నుంచి కొండ వరకూ ముందుగా చేరిన వారిదే గెలుపు అని చెప్పింది.


3. కుందేలు వాయువేగం తో ముందుకు సాగింది. 


4. కుందేలు నిద్ర లో ఉండగా తాబేలు మెల్లగా నడుస్తూ కొండ చేరుకుంది. 


5. కుందేలు ఇక ఎన్నడూ పందాలు కట్టటం, ఎగతాళి చేయటం మానేసింది.

***
1. అడవిలో అహంకారి ఎవరు?
a. కుందేలు 

b. తాబేలు 
c. చీమ

2. కుందేలు ఎండగా ఉందని ఎక్కడ విశ్రాంతి తీసుకుంది?
a. చెరువులో 

b. చెట్టు 
c. ఇంట్లో

3. విజయం పొందినది ?
a. కుందేలు 

b.తాబేలు 
c. ఇద్దరూ 
d. ఎవరూ కారు

ఈ కథ అభ్యాసము వ్రాసిన వారు లావణ్య.

No comments:

Post a Comment