Wednesday, January 2, 2013

గుణింతాలతో వాక్యాలు

గీత సీతతో కలసి నీతి శతకం చదివింది
మానస, రాగిణి గుడిలో తిరిగారు
సావేరి కావేరి నదికి పోయారు
గంగ మంగ టంగుటూరులో కలిశారు

రాజి జాజి తీగకు నీరు పోసింది
సుమన్ పాట చాలా బావుంది
కిటికీ తలుపులు తెరిచి చూడు
మంచు కొండ అందంగా ఉంది

మేడమీద గదిలో మంచ౦ వేసింది
నేను నవీన్ కాగితపు పడవ చేశాము
నాకు తెలుగు చదవడం తెలుసు
నేను బావ ఇవాళ సినిమా చూశాము

మేము పెరుగు తింటాము
తలుపు వెనకాల చీపురు ఉంది.
కాగితపు పడవ చేయడం నీకు తెలుసా?
తెలుగులో నీవు చదువగాలవా?

మీ పాప పేరు ఏమిటి?
నీకు అరటి ఆకు అంటే తెలుసా?
మేము భైరవి కోన సినిమాకి పోయాము
మీరు చూసిన సినిమా బావుందా?

రేపు మనం బాలుతో ఆడుకుందమా?
ఏదీ ఒకసారి నీ నాలుక చూపించు
రెండు చేతులో ఏది మంచిది?
మీ పేరు ఏమిటి?

నీకు తలుపు ఎలా ఉంటుందో తెలుసా?
మేము ఆరాధన సినిమాకి పోయాము
ఆదివారం చూసిన సినిమా బావుందా?
మనమందరం బాలుతో ఆడుకుందమా?

ఏదీ నీ నాలుక చూపించు
రెండు చేతులు కలిపితే దండం అవుతుంది
మీ పేరు ఏమిటి? చెపుతారా రాసుకుంటాను
బంగారు పాపలు అంటే ఎవరు?

మాపటి వేళ అంటే ఏ సమయము?
చంటి పాపలు ఎంతో అమాయకంగా ఉంటారు
మాపటి వేళ ఆవులు ఇంటి వైపు నడిచాయి
పసి పాపల మురిపాల మాటలు చాలా బావుంటాయి

మీరు మా ఇంటికి రండి
మీరు ఎటువంటి కథలు చదువుతారు?
ఈ రోజు ఆదివారం. అందుకే శలవు.
రేపు సోమవారం బడికి పోవాలి

మంగళ వారం మంచు కురవడం వలన సెలవు
పడవను నడిపువానిని సరంగు అంటారు
పసుపు రంగు గాజుల జత చాలా బావుంది
పడవలో నైలు నదిని దాటడం ఒక రంగుల కల

కంచెమీద పాకిన పూల తీగ అందంగా ఉంది
ఈదురు గాలికి తీగలు కింద పడిపోయాయి
పాటల పోటీకి సునంద వెళుతోంది
రెండవ తరగతిలో మేము గుణింతాలు  రాశాము

జేబులో కలము ఉంటే రాయడానికి వీలుగా ఉంటుంది.
ఆకాశం పసిడి వెలుగులో మెరిసిపోతోంది

నీలి మేఘాలు వాన పడుతుంది
వీధి వాకిలి ఎదురుగా బంతి పూలు పూశాయి
కిటికీ తలుపులు వేయడం మరచిపోకూడదు
మంచు కొండలు చాలా అందంగా ఉంటాయి
తలుపు తెరిచి చూడు
రేపు ఉదయం సినిమాకు వెళదాము

ఆదివారం పూట బడికి సెలవు
రోజూ ఆకుకూరలు తినాలి
మా బాబాయికి చాలా కథలు తెలుసు
ఉదయం నేను బజారుకు పోయాను

ఆకు మీద గొంగళి పురుగు పాకుతోంది
గులాబి రేకులు ఎంతో సుకుమారంగా ఉంటాయి
ఆదితికి పాములంటే చాలా భయ౦.
సునీల్ ఇవాళ పాఠం చెపుతారు

బెండకాయ అంటే రమేష్ కి పడదు
బయట ఆడుకోవాలంటే షూస్ వేసుకోవాలి




No comments:

Post a Comment