Thursday, November 15, 2012

అల్లరి పిల్ల

గదిలో, చిట్టితల్లి బొమ్మలతో, ఆడుకుంటోంది. 
అమ్మ, పుస్తకం చదువుకుంటోంది. . 
కొంచెం సేపటి తరువాత, అమ్మకు పాప కనిపించలేదు. 

“చిట్టితల్లీ ఎక్కడున్నావ్?”
“ఇక్కడున్నా..”
“అక్కడేం చేస్తున్నావ్?”
“మట్టి తింటున్నా..”

అమ్మ వెళ్ళి, చీమలు పెట్టిన మట్టి తింటున్న పాప నోరు కడిగి,

“మట్టి యాక్కీ, తినకూడదు నాన్నా” అని చెప్పింది.
“యక్కీనా” పాప అడిగింది.
“అవును మట్టి తింటే పొట్టలో పాములు వస్తాయి. ఇంకెప్పుడూ తినకు.” 
పాప అనుమానంగా చూసింది. 
అమ్మ చెప్పిన విషయం పాప నమ్మలేదు.

పాప మట్టి తినడం మానలేదు. 
అమ్మ మట్టిలో కారం కలిపింది.
చిట్టి తల్లి మట్టి నోట్లో పెట్టుకోగానే కారం పుట్టింది. 
అమ్మ వారం పాటు రోజూ మరచిపోకుండా మట్టిలో కారం చల్లింది.

చిట్టి తల్లి వాళ్ళ ఇంటి దగ్గర చాలా మంది పిల్లలు వున్నారు. 
వాళ్ళలో చిట్టితల్లే చిన్నది.
అందువల్ల పిల్లలకు, పెద్ద వాళ్ళకు కూడా చిట్టితల్లి అంటే చాలా ఇష్టం. 

సాయంత్రం, పిల్లలందరూ మేడ మీద ఆడుకుంటారు. 
అమ్మ వాళ్లతో "పాప మట్టితినకుండా చూడండి" అని చెప్పింది. 
పాప గోడ మూలల్లోని మట్టి తినడం మానేసింది.

మట్టి తినడమైతే మానేసింది కాని, గోడకున్న సున్నం నాకడం అలవాటు చేసికుంది. 
రోజూ లాగే ఆ రోజు కూడా పిల్లలు పాపను మేడపైకి తీసుకెళ్ళారు. 
అమ్మ రోజూలాగే జాగ్రత్తలు చెప్పింది..

ఓ అరగంట గడిచాక, చిట్టితల్లి ఏం చేస్తుందో చూద్దామని అమ్మ మేడ పైకి వెళ్ళింది.
పైకి వెళ్ళిన అమ్మ ఆశ్చర్యంగా నిలబడిపోయింది. 
ఇంతకూ అమ్మకు ఏం కనిపించింది?



సమాధానం కోసం ఇక్కడ చూడండి. (చివర పారాగ్రాఫ్ లో మీకు సమాధానం దొరుకుతుంది).

1 comment:

  1. Chaala bavundi.. Ending inka bavundi.. Chaala navvu vacchindi.

    ReplyDelete