Saturday, September 3, 2011

యుద్దకాండము

ఇప్పటి వరకు మనం బాలకాండము, అయోధ్యాకందము, అరణ్యకాండము, కిష్కిందాకాండము, సుందరకాండము చెప్పుకున్నాం కదా.. ఇప్పుడు యుద్ధకాండము మొదలవుతుంది.

పోయినవారం మనం హనుమంతుడు లంకను వెళ్ళి సీతను కలసి తిరిగి రాముని దగ్గరకు వచ్చాడాని చెప్పుకున్నాం కదా..వచ్చి ఏం చెప్పాడంటే, "ప్రభూ రావణుడనే రాక్షసుడు సీతదేవిని తీసికెళ్ళాడు. సీతాదేవి అక్కడ చాల కష్టపడుతు౦ది"అని  చెపుతాడు. అప్పుడు రాముడు, రావణుడితో యుద్ధం చెయ్యడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసికుని, తన సైన్యంతో సముద్రం దగ్గరకు వస్తాడు. ఆ సమయంలోనే రావణుడి తమ్ముడైనా విభాషణుడు రామున్ని కలసి "రామా నన్ను మా అన్న దేశం నుండి పంపించేశాడు. నన్ను నువ్వే రక్షించాలి" అని వేడుకుంటాడు. అప్పుడు రాముడు, "విభీషణా, నిన్ను రక్షించడమే కాదు, లంకా రాజ్యానికి రాజును చేస్తాను" అని అభయమిస్తాడు.

రావణుడితో యుద్ధం చేయాలంటే సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాలికదా..సముద్రం దాటడం ఎలా అనుకుని, తనూ తన సేనలు నడిచిపోయేలాగా దారి విడువమని సముద్రుడిని ప్రార్ధించాడు రాముడు. అది ప్రకృతికి విరుద్దంమైన విషయం కాబట్టి సముద్రుడు ఏమీ పలకడు. రాముడికి కోపం వచ్చి దారి ఇవ్వకపోతే సముద్రాన్ని పూర్తిగా ఎండిపోయ్యెట్లు చేస్తానని బాణం వెయ్యబోతాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై, "రామా అలా చేస్తే సముద్రంలో ఉండే జీవులన్నీ చచ్చిపోతాయి. అలా చెయ్యొద్దు, మీకో ఉపాయం చెప్తాను. సముద్రంలో రాళ్లు వెయ్యండి,  తేలేటట్లు చేస్తాను" అని చెప్తాడు. 

వానరులందరూ పెద్దపెద్ద రాళ్ళు తెచ్చి నీళ్ళలో వేస్తారు. ఒక ఉడుత తాను కూడా రాముడికి చేతనైన సహాయం చెయ్యాలని ఏ౦ చేసిందో తెలుసా, నీళ్ళలోకి వెళ్లి పూర్తిగా తడిసి ఒడ్డుకు వెళ్లి ఇసుకలో దొర్లుతుంది. ఆ ఇసుకన౦తా సముద్రంలో కలిపేసి వస్తోంది. అది చూసి రాముడు ఆ ఉడుతను చేతిలోకి తీసుకుని దాని వేపుమీద ప్రేమగా నిమురుతాడు. అందుకే ఇప్పటికీ ఉడుత వీపుమీద మూడు చారలు ఉంటాయి..ఈ సారి ఉడుతను చూసినప్పుడు గమనించండి. 

సముద్రంలో వేసిన రాళ్ళతో నలుడు వారధి అంటే బ్రిడ్జి కడతాడు. వానరసేనతో రాముడు ఆ వారదిమీడుగా నడిచి లంకానగారానికి చేరతాడు. రాముడు, "సీతను సగౌరవంగా అప్పగించితే లంకను వదిలి వెళతామమా. రావణుడి దగ్గరకు రాయబారం" రావణుడికి తెలపమని వాలి కుమారుడైన అంగదుడిని పంపుతాడు. రావణుడు అంగదుని మాట వినకపోగా మీ కోతులు నన్నేమీ చెయ్యలేవు అని ఎగాతాళి చేస్తాడు. ఆ మాటకు అంగదుడు, "అయితే నన్నేమీ చెయ్యఖ్ఖరలేదు నా కాలు కదపండి చూద్దాం" అని కాలు గట్టిగా నేలమీద తొక్కి పెడతాడు. రాక్షసులేవ్వరూ  ఎవరూ కూడా కొంచెం కూడా కదిలించ లేరు, ఆఖరకు రావణుడు కూడా ప్రయత్నిస్తాడు కాని కదపలేకపోతాడు. అప్పుడు అంగదుడు, "నా కాలెందుకు, రాముని కాళ్ళు పట్టుకుంటే మీరు నాశనమైపోకుండా ఉంటారని" చెప్పి తిరిగి రాముని దగ్గరకు వస్తాడు. 

యుద్ధం మొదలౌతుంది. వానరులు రాక్షసులనందరినీ చంపేస్తూ ఉండడం చూసి, రావణుడు తన ముద్దుల కొడుకైన ఇంద్రజిత్తుని యుద్దానికి పంపిస్తాడు. ఇంద్రజిత్తు మహా మాయలమారి, వానర సేనల మీదకు నాగాస్త్రం వేస్తాడు. నాగాస్త్రం వేస్తే బోలెడన్ని పాములు, ఆ సైన్యం మీద పడతాయన్నమాట. రాముడది చూసి బాణం వెయ్యగానే గరుత్మంతుడు వచ్చి ఆ నాగులన్నేటినీ చంపేస్తాడు.

రావణుడు ఇక లాభం లేదని తన ఇంకో తమ్ముడైన కుంబకర్ణుడిని యుద్దానికి పంపిద్దామనుకుంటాడు. కుంబకర్ణుని కథ వచ్చేవారం చెప్పుకుందా౦.

రామాయణం ఇంతవరకూ ఎన్ని కాండములు చెప్పుకున్నాం?
ఇప్పుడు ఏ కాండము మొదలైనంది?
హనుమంతుడు రామునకు ఏమి చెప్పాడు?
సముద్రముపై వారిధి ఎవరు కట్టారు? ఎలా కట్టారు?
రాముడు, వానర సైన్యం సముద్రాన్ని ఎలా దాటారు?
రావణునితో రాయబారానికి ఎవరు వెళ్లారు?
అంగదుడు రావణుడితో ఏమి చెప్పాడు?
అంగదుడు రావణుని కొలువులో వెళ్లి ఏమి చేశాడు?
రావణుని కుమారుడి పేరు ఏమిటి?
చివరగా యుద్ధానికి ఎవర్ని పంపించాలనుకున్నారు?No comments:

Post a Comment