Thursday, November 24, 2011

తాటక వధ


        రామాయణంలో మనం రామ లక్ష్మణులు, విశ్వామిత్రునితో అడవికి వెళ్లడం వరకూ కథ విన్నాం కదా. ఆ తరువాత కథ ఇప్పుడు చెప్పుకుందాం.

       విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు ఆశ్రమానికి వెళుతూ దారిలో చీకటి పడగానే ఆగిపోయి, మళ్ళీ ఉదయన్నే లేచి స్నానాలు చేసి బయలుదేరేవాళ్ళు. పాపం రామ లక్ష్మణు లిద్దరూ అంతః పురంలో అంటే 'కాజిల్' లో గారాబంగా పెరిగిన వాళ్ళు కదా, అయినా సరే ఒట్టి కాళ్ళతో, అంటే  చెప్పులు కూడా లేకుండా నడుస్తూ ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటున్నా పట్టించుకోకుండా... విశ్వామిత్రుడు ఏం పెడితే అది తిని, నీళ్ళు తాగి వెళుతున్నారట. ఒక్క కంప్లైంట్ కూడా చేయ్యలేదట. ఎందుకో తెలుసా ఏదైనా సాధించాలంటే అలాంటి ఇబ్బందులు పట్టించుకోకూడదని వాళ్లకు తెలుసు. 

     అలా వెళ్తూ వెళ్తూ ఒకరాత్రి ఒక ఆశ్రమ౦లో వున్నారు. ఆ తెల్లవారి అంటే నెక్స్ట్ మార్నింగ్ బాగా అలసి పోయి ఉన్నారేమో మహర్షి ఎంత పిలిచినా లేవలేదు. తరువాత చిన్నగా లేచి స్నానాలవీ చేశాక మహర్షి వాళ్ళకు 'బల', 'అతిబల' అనే విద్యలు చెప్పాడు. అంటే ఏంటో తెలుసా! నిద్ర, ఆకలి, అలసట, బద్దకము లాంటివేమీ వాళ్ళ దగ్గరకు రాని స్కిల్స్ అన్నమాట.

    అన్నట్టు ఆ రెండూ స్కిల్స్ మీక్కూడా తెలుసు కదా...ఎలాగో చెప్పండి. పోనీ నేను చెప్పనా..మన౦ వీడియో గేమ్స్ ఆడుతున్నామనుకో౦డి, లేకపోతే మనింటికి ఫ్రెండ్స్ వచ్చారనుకోండి....నిద్ర, ఆకలి, టయర్డ్ నెస్ ఇవేమీ మన దగ్గరకు రావు కదా.. అంటే మనక్కూడా అవన్నీ తెలిసినట్లేగా..ఇకనుంచి మనం, మన స్కిల్స్ ని వాటితో పాటు చదువు, పనిలో కూడా యూజ్ చేద్దా౦.

      మళ్ళీ వాళ్ళ ప్రయాణం అంటే జర్నీ కంటిన్యూ చేశారు. ఫైనల్ గా వాళ్ళు మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చారు. అప్పుడు మహర్షి “మీరు ఇక్కడే ఉండి మీ విల్లు, బాణాలు రెడీగా ఉంచుకోండి. తాటకి అనే రాక్షసి ఈ చుట్టుపక్కలే ఉంటుంది, దానికి వెయ్యి ఏనుగులు అంటే తౌజండ్ ఎలిఫె౦ట్స్ అంత బలం ఉంటుంది. మనం వచ్చిన శబ్ద౦ విని ఎప్పుడైనా రావొచ్చు” అని చెప్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్న శబ్దానికే తాటకి, “ఎవర్రా వచ్చిందీ?” అని అరుస్తూ పెద్ద చెట్టును భూమి అంటే  ఎర్త్ లోనుండి లేపి వాళ్ళ మీదకు వెయ్యడానికి వస్తూ ఉంటుంది.

       "రామా తాటకి మీదకు బాణం వెయ్యి" అన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడు రాముడు "మహర్షీ, తాటకి ఒక స్త్రీ కదా! నేను బాణం వెయ్యొచ్చా?" అని అడుగుతాడు. స్త్రీ అంటే లేడీ అని అర్ధం.  ఇక్కడ రాముడేమన్నాడో విన్నారా...”ఒక స్త్ర్రీ మీదకు బాణం వెయ్యొచ్చా?” అని. ఎందుకో తెలుసా మన హిందూ సాంప్రదాయం అంటే కల్చర్ లో ఆడవాళ్ళని దేవతలు అంటే గాడెశస్   లాగా పూజి౦చాలని చెప్తారు. అయితే దానికి విశ్వామిత్రుడేమన్నాడంటే  "యాగ రక్షణ కోసం కదా చంపమన్నది కాబట్టి చంపొచ్చు" అని చెప్తాడు. 

     "రాముడు ఒక్క బాణం వేసేసరికి అంత పెద్ద రాక్షసి కూడా చచ్చిపోతుంది. అప్పుడు విశ్వామిత్రుడు, ఇంకా దేవతలందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఒక మంచి రోజు చూసుకుని విశ్వామిత్రుడు యజ్ఞం మొదలు పెడతాడు. రామ లక్ష్మణులు నిద్ర, ఆహారం తీసుకోకుండా కూడా ఆ యజ్ఞాన్ని కాపాడుతూ ఉంటారు. అప్పుడేమైందో తెలుసా! మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు వస్తారు. ఆ యజ్ఞం జరక్కుండా చెయ్యాలని హోమంలో దొరికినవనీ విసిరి వేస్తుంటారు. వాళ్ళు రాక్షసులు కదా అందుకే వాళ్ళకా చెడ్డ ఆలోచనలు వస్తాయి. కాని రాముడు లక్ష్మణుడు ఆ రాక్షసులను చంపేసి యజ్ఞం పూర్తయ్యేలా చేస్తారు. 

     ఆ విధంగా రామ లక్ష్మణులు ఇద్దరూ గురువు దగ్గర విద్యలు నేర్చుకుని, వెళ్ళిన పని విజయవంతంగా అంటే సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు.

రామలక్ష్మణులు ఎవరితో వెళ్ళారు? ఎక్కడికి? ఎవరి కోసం?
వాళ్లకు ఆకలి వేస్తే ఏం చేశారు?
విశ్వామిత్రుడు వాళ్లకు ఏం విద్యలు నేర్పించాడు?
ఆ విద్యలు మీక్కోడా తెలుసా?
విశ్వామిత్రుడు తాటకిని చంపమంటే రాముడు ఏమని అడిగాడు?
మన హిందూ సాప్రదాయం ప్రకారం ఆడవాళ్ళను ఎలా చూడాలి?
మీరు మంచి పని చేస్తే ఎవరు సంతోషిస్తారు?
యజ్ఞాన్ని పాడు చేద్దామని ఎవరనుకున్నారు? వాళ్ళ పేర్లేమిటి? ఎందుకు?


No comments:

Post a Comment