Saturday, November 26, 2011

రామ లక్ష్మణులు విశ్వామిత్రునితో వెళ్లడం


        ఆ పిల్లలకు ఐదు ఏళ్ళు వచ్చినప్పుడు మహారాజువసిష్ఠ మహామునితో అక్షరాభ్యాసము’ చేయించారు. ఆ అన్నదమ్ములు’ అంటే బ్రదర్స్ ఆ మహర్షి దగ్గర వేదాలు, ‘ధనుర్విద్య’ అంటే  బాణాలు ఎలా వెయ్యాలో నేర్పి౦చడం అన్నమాట, ‘గుఱ్ఱపు స్వారి’ అంటే హార్స్ రైడింగ్లాంటివన్నీ నేర్చుకున్నారు.

      ఒకరోజు విశ్వామిత్రుడు’ అనే మహర్షిఅయోధ్యకు వచ్చారు. ఆ విషయం తెలిసిన రాజు ఆ మహర్షికి ఎదురెళ్ళినమస్కర౦చేసిలోపలికి తీసుకుని వెళతాడు. అప్పుడు విశ్వామిత్రుడు, “రాజా నీ సహాయం’ అంటే హెల్ప్ కోరి వచ్చాను.” అని అంటాడు. దానికి రాజేం అన్నాడో తెలుసా  “మీరు పెద్దవారు. మీకునా సహాయమా! చెప్పండిఏం కావాలన్నా చేస్తాను” అన్నాడు. చూశారా రాజు ఎంత మర్యాదగా అడిగాడో. మహర్షి ఏ౦ అడిగాడో చూద్దాం.రాజా నేను ప్రజలు’ అంటే పెపుల్ అందరూ బావుండాలని ఒక యజ్ఞం చేస్తున్నాను. కాని రాక్షసులు’ అంటే డీమాన్స్ఆ యజ్ఞం చెయ్యనీకుండా గొడవ చేస్తున్నారు. నువ్వు రాముణ్ణి నాతో పంపించు. రాముడు రాక్షసులతో యుద్ధం చేస్తాడు” అంటాడు.

      రాజుకు రాముణ్ణి పంపించాలంటే భయం వేసింది. ఎందుకంటె రాముడు చాలా చిన్నవాడు కదా.   రాజు మహర్షితో, “రాముడు చాలా చిన్నవాడు. రాక్షసులతో యుద్ధం చేయలేడు. నేను నా సైన్యంతో వచ్చి యజ్ఞం పూర్తయ్యేలా చూస్తాను” అని చెప్తాడు. దానికి విశ్వామిత్రుడు, “రాజాఏమడిగినా చేస్తానని నాకు మాట ఇచ్చావు. ఆడిన మాట తప్పుతావాఅంటే నువ్వు ప్రామిస్ బ్రేక్ చేస్తావా” అని కోపంగా వెళ్లబోతుంటేఅక్కడే ఉన్న వసిష్ఠ మహర్షి దశరధా  ఒక్కమాట. అక్కడ విశ్వామిత్ర మహర్షి ఉ౦టారుగారాముడికి ఏమీ ఫరవాలేదు. పైగాదీనివల్ల రాముడికి అంతా మంచే జరుగుతుంది” అని చెప్తాడు. దశరధుడురాముణ్ణి పంపించడానికి ఒప్పుకుంటాడు. లక్షముడుతెలుసుగా రాముడి తమ్ముడు నేను కూడా అన్నతో వెళ్తానూ... అని రామునితోపాటు విశ్వామిత్రునితో అడవికి వెళతాడు.

దశరధ మహారాజుకి పిల్లలెంతమంది ?
వాళ్ళ పెర్లేమిటి?
అయోధ్యకు ఏ మహర్షి వచ్చాడు?
మహర్షి వచ్చినప్పుడు మహారాజు ఏం చేసాడు?
విశ్వామిత్ర మహర్షి ఏం అడిగాడు?
రాముడు అడవికి వెళ్ళడా?
రామునితోపాటు అడవికి ఎవరు వెళ్లారు?


No comments:

Post a Comment