Wednesday, November 30, 2011

రాముని జననం(పుట్టుక)


     రావణుడనే రాక్షసుడురాక్షసుడంటే ‘డీమాన్’. చాలా కష్టమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి తనకు ‘మునులుదేవతలుగంధర్వలు’ వీరెవ్వరి చేతిలోనూ చావని వరం తీసుకున్నాడు. ఇక తననెవ్వరూ చ౦పలేరనే గర్వంతో అందరినీ బోలెడు పెట్టడం మొదలుపెట్టాడు.

        ఆ రాక్షసుడి బాధకు సూర్యుడు డల్ గా అయిపోయాడుసముద్రంలో అలలు ఆగిపోతున్నాయిగాలి కూడా కదలడానికి భయపడింది. అ౦దరూ బ్రహ్మ దేవుడి దగ్గరకెళ్ళి వాళ్ళ కష్టాలు అంటే ప్రొబ్లెంస్  చెప్పుకున్నారు. అప్పుడు బ్రహ్మదేముడు “భయపడకండిరావణుడ్నిఎలా చంపాలో నేను నేను చెపుతాను” అన్నాడు. “ఎలాఅతనికి ఎవరి చేతిలోనూ చనిపోని వరం ఉందిగా” అన్నారు దేవతలు. అప్పుడు బ్రహ్మ “ఆ రావణుడు వరమడిగేప్పుడు ఒక్క తప్పు చేశాడు, అన్ని జాతుల పేర్లూ చెప్పాడు కానిమనుషులుకోతులూ తననేం చేయలేరనే గర్వంతో వాళ్ళ గురించి చెప్పడం మరిచిపోయాడు” అన్నాడు.

        అప్పుడు దేవతలందరూ వైకుంఠపురానికి వెళ్లారు. అక్కడ ఎవరుంటారో తెలుసా శంఖు చక్రాలు ధరించిన విష్ణుమూర్తి. దేవతలు విష్ణుమూర్తితో “ప్రభూ శ్రీహరీలోకకళ్యాణం కోసం అంటే, అందరూ సుఖంగా ఉండడం కోసం నిన్నొక కోరిక కోరుతున్నాము. ఆ రావణున్ని చంపడానికి నువ్వు మానవ రూపంలో పుట్టాలి” అన్నారు. విష్ణుమూర్తి వాళ్ళ విష్ ప్రకారం పుత్రకామేష్టి యాగం చేస్తున్న దశరాధుడికి కొడుకుగా పుట్టడానికి నిర్ణయించుకున్నాడు, అంటే డిసైడ్ చేసికున్నాడు.

    దశరథ మహారాజు పుత్ర కామేష్టి అనే యజ్ఞము చేశాడు కదా...అప్పుడు ఆ యజ్ఞం లోనుంచి ఒక దేముడు ప్రత్యక్షమైప్రత్యక్షమవడమంటే అంటే కనిపించడం, మహారాజుకి ఒక పాయసం వున్న బంగారుగిన్నెను ఇచ్చాడు. ఆ రాజు పాయసాన్ని రాణులకు ఇచ్చాడు. ఆ తరువాత కొన్ని నెలలకు కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుజ్ఞుడు, కైకేయికి భరతుడు పుట్టారు. ఆ రాజ్యంలో వాళ్ళంతా చాలా... సంతోషంగాఅంటే హాపిగా ఫీల్ అయ్యారు.

రాక్షసుడ్ని ఇంగ్లీష్ లో ఏమంటారు?
రావణాసురుడు ఏమి చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు?
రావణుడు ఏమి వరం అడిగాడు?
దేవతలందరూ ఎక్కడికెళ్ళారు?
వైకుంఠంలో ఎవరుంటారు?

రాముని తల్లి పేరేమిటి?
లక్ష్మణుడి తల్లి పేరేమిటి?
భరతుడి తల్లి పేరేమిటి?
శత్రుజ్ఞుడి తల్లి పేరేమిట?

No comments:

Post a Comment