Friday, May 1, 2015

ఆరవ వార్షికోత్సవం

        పాఠశాల మొదలుపెట్టి ఆరు సంవత్సరాలు పూర్తయిందంటే నమ్మశక్యంగా లేదు. తెలుగులో ఒక్క అక్షరం పలకలేని పిల్లలు ఈరోజు మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మొదలు పెట్టినప్పుడు పుస్తకాలు లేవు, ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో తెలీదు. అలాంటిది ఇవాళ మాకై మేము సొంతంగా పాఠ్యాంశాలను రూపొందించుకుని పాఠాలు చెప్పగలగడమే కాక, పాఠాలు చెప్పాలన్న ఉత్సాహంతో ముందుకు వచ్చిన వారికి ప్రణాళిక ఇవ్వగలిగే స్థాయికి వచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది. 

ఇన్ని సంవత్సరాలు అర్ధరాత్రి, అపరాత్రి అని లేక ఫోన్ చేసినా విసుక్కోక నన్ను భరించి నాతో నడిచిన ఉపాధ్యాయులు, మీరివన్నీ మీ పిల్లలతో చేయించాలంటే ఎందుకు ఏమిటి అని అడక్కుండా తూ. చా. తప్పకుండా పాటించిన తల్లిదండ్రులు, పద్యాలు, పాటలు, ఆటలు, మాటలు అన్నీ నేర్చిన చిన్నారులు, నాలుగు తరగతులు పూర్తి చేసి పాఠశాలను ప్రగతి పథం వైపు నడిపిస్తున్న పట్టభద్రులు అందరూ ఈ విజయంలో భాగస్వాములే. 


ఆరవ వార్షికోత్సవం విశేషాలు ఇక్కడ చూడొచ్చు. . 

2 comments:

  1. అభినందనలు. బడి మొదలైపోయిందా?

    ReplyDelete
    Replies
    1. లక్ష్మి గారు బడి మొదలవబోతోందండి. ఆ వివరాలతో ఇప్పుడే ఒక పోస్ట్ రాశాను.

      Delete