Thursday, December 1, 2011

కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా

కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా ||2||
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా ||2||
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు||2|| ||కృష్ణ శాస్త్రి కవితలా||

కృష్ణదేవరాయల కీర్తి వెలుగు తెలుగు  
తెలుగూ...                                     ||2||
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగు ||2||
కూచిపూడి నర్తన త్యాగరాజ కీర్తన  ||2||
అడుగడుగు అణువణువు 
అచ్చతెలుగు జిలుగు తెలుగు సంస్కృతికే ముందడుగు 
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు ||కృష్ణ శాస్త్రి కవితలా||

పోతులూరి వీరబ్రహ్మ సుక్తులన్ని తెలుగు
పొట్టి శ్రీరాముల త్యాగనిరతి తెలుగు ||2||
కందుకూరి సంస్కారం చిలకమర్తి ప్రహసనం ||2|| 
నేటి తరం ముందు తరం అనుసరించు బాట తెలుగు
జాతికిదే బావుటా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు  ||కృష్ణ శాస్త్రి కవితలా||
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు  ||2||  ||కృష్ణ శాస్త్రి కవితలా||

ఈ పాట ఇక్కడ వినొచ్చు.


No comments:

Post a Comment