Tuesday, August 6, 2013

తీర్పు


ఒకసారి అదృష్ట దేవత(goddess of fortune), దురదృష్ట దేవత(goddess of misfortune) కూర్చుని మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యన ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారో అని వాదన(argument) వచ్చింది. “సరే... ఎవరయినా తెలివైన వాడి(wise person) దగ్గరికి వెళ్లి అడుగుదాం అప్పుడు వాళ్ళు ఏది చెపితే అది నిజం అని ఒప్పుకుందాము” అనుకుని నిర్ణయించుకున్నారు(decided).

ఇద్దరు కలిసి ఒక ఉరిలో ఉన్న పెద్ద వ్యాపార వేత్త(business man) దగ్గరికి వెళ్లారు. అతని ఇంటి తలుపు కొట్టి, అతనికి వాళ్ళ వాదన గురించి చెప్పి, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పమన్నారు.

ఆ వ్యాపార వేత్తకి ఏమి చెప్పాలో తెలియ లేదు . అదృష్ట దేవతని పోగిడితే(praise), దురదృష్ట దేవతకి కోపం వచ్చి శపిస్తుంది(curse). దురదృష్ట దేవతని పొగిడితే(praise) అదృష్ట దేవత అలిగి ఉన్న అదృష్టాన్ని కూడా తీసుకెళ్ళి పోతుంది. ఏమి చెప్పాలి అని కాసేపు అలోచించి, “అదృష్ట దేవతా నువ్వు నా ఇంట్లోకి నడుచుకుంటూ రా, దురదృష్ట దేవతా నువ్వు ఆ గేటు దాకా నడిచి వెళ్ళు, అప్పుడు మీ ఇద్దరినీ చూసి ఎవరు అందగత్తో చెబుతాను” అని చెప్పాడు. సరేనని అదృష్ట దేవత ఇంట్లోకి నడిచి వచ్చింది, దురదృష్ట దేవత ఇంటి ముందు గేటు తీసి నిలబడింది.


అప్పుడు వ్యాపార వేత్త ఇలా చెప్పాడు. “అదృష్ట దేవతా నువ్వు ఇంట్లోకి నడిచి వస్తే అందంగా ఉన్నావు, దురదృష్ట దేవతా నీవు బయటికి వెడుతుంటే అందంగా ఉన్నావు. అందం లో మీ ఇద్దరు సమానంగా ఉన్నారు” అని తీర్పు(judgement)చెప్పాడు.

వ్యాపార వేత్త మాటల్లోని లౌక్యాన్ని(wisdom/ tactfulness ) గ్రహించి దురదృష్ట దేవత ఇంటి బయట గేటు తీసుకుని వెళ్ళిపోయింది. అదృష్ట దేవత నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చి కూర్చుంది. వ్యాపార వేత్త , హమ్మయ్య గండం గట్టెక్కింది( narrow escape from the trouble)అని నిట్టూర్చాడు.
ఈ క్రింది ప్రశ్నలకి జవాబులు ఇవ్వండి .

1.వ్యాపార వేత్త అంటే ఎవరు?

2. అదృష్ట దేవత , దురదృష్ట దేవత ల కి మధ్య ఏ వాదన(argument) వచ్చింది?

౩. వ్యాపార వేత్త ఏమని భయపడ్డాడు ?

4. వ్యాపార వేత్త ఏమని తీర్పు ఇచ్చాడు?

5. తీర్పు అంటే ఏమిటి?

6. కధ వల్ల మీకు ఏమి అర్ధమయ్యింది?



అం
త్తె
తీ
తీ
రు
దృ
దృ
ప్పు
వా
గం
మా
ర్పు
ష్ట
ము
ష్ట
కి
డం 
మా
ము
సం
దే
లి
ము
తీ
రు
నూ
కా
గి
కా
దా
లౌ
క్యం
ము
రే
వు
చా
వ్యా
పా
ర 
వే
త్త
రు
మీ
రు
మా
ము
ద్ద
పొ
గు
డు 
మే
ల్లు
మా
పే
మా
తే
గు
లు
రా


1. అందగ త్తె 2. అదృష్టము  ౩. అదృష్ట దేవత  4. తీర్పు 5. లౌక్యం 6. వాకిలి  7. వాదన  8.తగవు
9. ఇద్దరు 10. సమానము 11.పొగుడు 12.వ్యాపారవేత్త  13. భయము 14. ఇల్లు 15. అలిగి  16. గండం


కథ, అబ్యాసము: రాధ వేలూరి.

2 comments: