Wednesday, May 25, 2011

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు, ||2||
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి. ||మా తెలుగు||

గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.||మా తెలుగు||

అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా

రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి , జై తెలుగు తల్లి....

maa telugu thalliki mallepoodanda,
maa kannathalliki mangalarathulu,
kadupulo bangaru kanuchoopulo karuna,
chirunavvulo sirilu dorlinchu mathalli.

galagalaa godaari kadilipothuntenu
birabiraakrishnamma paruguliduthuntenu
bangaaru pantalae panduthayee
muripaala muthyalu doraulutai.

amaravathinagara apuroopa shilpaalu
thyagayya gonthulo thaaraadu naadhaalu
thikkayya kalamulo thiyyamdanalu
nithyamai nikhilamai nilachi vundedaaka

rudramma bhujashakthi mallamma pathibhakthi
thimmarasu dheeyukthi,krishnarayala keerthi
maa chevulu ringumani maarumrogedaaka
nee paatalae paaduthaam, nee aatalae aadutham
jai telugu thalli, jai telugu thalli......


ఈ పాటను ఇక్కడ వినొచ్చు. సాధన చేయించేప్పుడు ఇదో ట్యూన్ లో సాధన చేయించండి.
ఈ పాట వాయిద్య సంగీతం ఇక్కడ వినొచ్చు.

No comments:

Post a Comment