Wednesday, April 18, 2012

ఎవరికి కేటాయించిన పనిని వారు చేయకపోతే పట్టే గతి

        పొలం గట్టుపైన అంటే  ఫీల్డ్ లో ఉన్న చెట్లలోంచి రెండు గింజలు లంటే సీడ్స్ కిందపడి దొర్లుకుంటూ పొలంలోకి వచ్చి, నేలలో అంటే గౌండ్ లో దాక్కున్నాయి. కొన్ని రోజులకు వర్షం పడటంతో గింజల్లో కదలిక వచ్చింది. అప్పుడు అవి ఒకదానితో ఒకటి మాట్లాడుతూ... "మనం ఇంకా ఈ నేలలో దాక్కోవడంలో అర్థం లేదు. మొలకెత్తి, మొక్కలుగా అంటే ప్లాంట్స్ లాగా, చెట్లుగా మారి మన బాధ్యతలను అంటే రేస్పాన్సిబిలిటి ఫుల్ఫిల్ చెయ్యాలి" అని చెప్పింది మొదటి గింజ. నీకెందుకు అంత తొందర. మొలకెత్తినప్పట్నించీ మనకు అన్నీ కష్టాలే కదా. చిగుర్లు వేసినప్పటినుంచీ కష్టాలు మొదలవుతాయి" అని బాధ పడింది రెండో గింజ. ఇంకా... కొత్త చిగుర్లు రాగానే పశువులు అంటే యానిమల్స్ తినేస్తాయని భయం, పెద్దయ్యేదాకా అదే బాధ, పండ్లు కాస్తే ఫర్వాలేదుగానీ, లేకపోతే కొట్టేస్తారు. ఆ బాధను నేను భరించలేనంటూ చెప్పింది.

      కాబట్టి... ఈ బాధలన్నీ తప్పించుకోవాలంటే మనం భూమి అంటే నేలలోనే ఉండిపోతే మంచిది. లేకపోతే కష్టాలు తప్పవని చెప్పింది రెండో గింజ. అయితే... వీటన్నింటినీ ఓపిగ్గా విన్న మొదటి గింజ విత్తనాలుగా మొలకెత్తడం మన బాధ్యత అంటే రేస్పాన్సిబిలిటి . మనదగ్గరకు వచ్చి సేదతీరే అంటే రెస్ట్ తీసుకునే వారికి చల్లని నీడను, పండ్లను ఇవ్వడంలోనే మన జీవితానికి అంటే లైఫ్ కి అర్థం అని చెప్పింది. ఇతరులకు సహాయపడటం అంటే హెల్ప్ చేయడం ద్వారా వచ్చే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఇత రులకు అన్నివిధాలా సహాయపడే అవకాశం అంటే ఆపర్చునిటీ ఎంతమందికి వస్తుంది? ఆ తృప్తి అంటే కంటెంట్ మెంట్, ఆనందం అనుభవిస్తేగానీ తెలియదు. నీ సంగతి సరే...! కానీ.. నేను మాత్రం మొలకెత్తి తీరుతాను అని తేల్చి చెప్పింది మొదటి గింజ."ఎంత చెప్పినా వినకుండా కోరి కోరి కష్టాల్లో పడతానంటే నేను మాత్రం ఏం చేయగలను. నీ ఖర్మ అంటూ" భూమిలోనే ఉండిపోయింది రెండో గింజ. అలా కొన్ని రోజులు గడిచాయి.

      మొదటి గింజ మొలకెత్తి నునులేత చిగుళ్లతో ఆకర్షణీయంగా అంటే అట్ట్రాక్తివ్ గా తయారైంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ రైతు అంటే ఫార్మర్ ముళ్లకంచె వేసి దానికి రక్షణ అంటే ప్రొటెక్షన్ ఇచ్చాడు. రెండో గింజ మాత్రం భూమిలోపల వెచ్చగా దాక్కుంది. అలా గడుస్తుండగా... ఒకరోజు గింజ దాక్కున్న చోటికే ఓ కోడిపుంజుల గుంపు భూమి పొరను కాళ్లతో తవ్వుకుంటూ వచ్చాయి. అలా తవ్వుతుండగా బయటపడ్డ రెండో గింజనుచూసిన కోడిపుంజు గబుక్కున మింగేసింది.ఇంకేముందీ... "అయ్యో...! నా స్నేహితుడు అంటే ఫ్రెండ్ చెప్పినట్టు చేసి ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు గదా. ఎవరికి కేటాయించిన పనిని వారు చేయకపోతే నాలాంటి గతే పడుతుందని" ఏడుస్తూ... కోడిపుంజుకు ఆహారమైంది రెండో గింజ.

ఈ కథ వ్రాసిన వారు గౌతమి గారు. ఈ కథను మీరు ఇక్కడ కూడా చదవొచ్చు.

పొలము             field
మొక్క               plant        
బాధ్యత              responsibility
జంతువులు       animals
గింజలు             seeds
సేద తీరడం        resting
జీవితం              life
సహాయపడడం  helping
ఆకర్షనీయం       attractive
అవకాశం          oppurtunity 
తృప్తి                contentment
భూమి             earth 
స్నేహితుడు      friend 

1 comment:

  1. CHALA bagundi andi.... repu ma pillalaki ee blog ni chuse pathalu nerputa..

    ReplyDelete