Friday, December 2, 2011

అల్ప బుద్ధివాని కధికార మిచ్చిన

అల్పబుద్ధివాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడి కుక్క చెరుకు తీపెరుగునా?
విశ్వదాభిరామ వినుర వేమ!

alpabuddivaani kadhikaaramichhina
doddavaarinella tholagagottu
cheppu thinedi kukka cheruku theeperugunaa?
viswadaabhiraama vinura vaema!

కుక్కకి చెప్పు అంటే ఇష్టం. మన చెరుకు ఇచ్చినా తినదు. కుక్క ఏవిధంగానైతే మంచి పదార్ధాన్ని వదిలి చెడ్డ పదార్ధాన్ని ఇష్టపడుతుందో అలాగే నీచమైన బుద్ధి కలిగిన వానికి అధికారం ఇచ్చినట్లయితే మంచి పని నచ్చక, మంచి చేసే వాళ్ళని వెళ్ళ గొడతారు అని అర్ధము.

No comments:

Post a Comment