Saturday, December 3, 2011

రామాయణము

        వాల్మీకి మహర్షి ఒకరోజు తన శిష్యులతో కలసి తమసా’ నదీతీరానికి వెళ్ళాడు. నది అంటే రివర్’, మహర్షి అంటే 'సెయింట్అన్నమాట. ఆ ప్రదేశం ఎంత అందంగా ఉందనుకున్నారూ! అక్కడ ఒక చెట్టు పైన క్రౌంచ పక్షులజంట(curlews) కూర్చుని సంతోషంగా పాటలు పాడుతూ ఉన్నాయి. అప్పుడు ఒక బోయవాడుఅంటే హంటర్’ వచ్చి తన బాణంతో ఒక పిట్టను కొట్టాడు. పాపం ఆ పిట్ట బాధగా అరుస్తూ కిందపడిపోయింది. పాపం ఆ రెండో పిట్ట దాని దగ్గర కూచుని ఏడవడం మొదలు పెట్టింది. ఇదంతా చూస్తున్న వాల్మీకి మహర్షికి చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంలో బోయవానిని తిట్టాడు. ఆయన మహర్షి కదాఆ తిట్లు కూడా శ్లోకం లాగా వినిపించాయట. ఆ శ్లోకం అర్ధం ఏమిటంటే 'సంతోషంగా ఉన్న పక్షుల జంటలో ఒకదానిని చ౦పావు కనుక నీవు ఇక ఏంతో సేపు బ్రతకవు అని. ఆ శ్లోకం విన్న వెంటనే ఆ బోయవాడు కిందపడి చచ్చిపోయాడు. 

       వాల్మీకి మహర్షిఅయన శిష్యులు ఆ నదిలో స్నానాలు చేసి తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అప్పుడేమయిందో తెలుసాబ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహర్షీ నువ్వు ఇందాక చెప్పిన శ్లోకము పూజనీయమైన గ్రంధరచనకు నాంది.” అని చెప్పాడు. అంటే నువ్వు రాయబోయే గొప్ప గ్రంధానికి ఇది మొదటిది అని అర్ధం. అప్పుడు వాల్మీకి స్వామీ ఏమిటి మీరంటున్నది?” అన్నాడు. మహర్షీ నువ్వు 'శ్రీ రామచరితంఅనే పవిత్ర గ్రంధము వ్రాయబోతున్నావు. అది సమస్త లోకాలకి ఆదికావ్యమౌతుంది.” అని చెప్పి అదృశ్యమైపోయాడు. 


        ఆ తరువాత వాల్మీకి రామాయణాన్ని రచించి బాలకాండముఅయోధ్యాకాండముఅరణ్యకాండముకిష్కింధాకాండముసుందరాకాండముయుద్ధకాండము మరియు ఉత్తరకాండము అనే ఏడు కాండాలుగా విభజించాడు. 


                                  బాలకాండము 


          అయోధ్య అనే రాజ్యానికి రాజు దశరధుడు. ఆయనకు ముగ్గురు భార్యలుకౌసల్యసుమిత్రకైకేయి. వారికి చాలా కాలం వరకు సంతానం కలుగలేదుఅంటే పిల్లలు పుట్టలేదన్నమాట. "అయ్యో పిల్లలు లేరే" అని వాళ్ళు చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు.


       అప్పుడు దశరధ మహారాజు 'అశ్వమేధ యాగముచేస్తే పిల్లలు పుడతారని తెలిసి ఆ యాగం చేశాడు. ఇంతకూ అశ్వమేధయాగం’ అంటే ఏమిటో తెలుసా? 'అశ్వంఅంటే గుఱ్ఱంఒక గుఱ్ఱానికి పూజలు చేసి దాన్ని వదిలి వేస్తారు. అది ఇక ఎక్కడకైనా వెళ్ళొచ్చు ఎటైనా తిరగొచ్చు. ఆ యజ్ఞాశ్వం ఏయే రాజ్యాలలో తిరిగితే ఆ రాజ్యాలన్నీ అయోధ్యలో కలసి పోతాయన్నమాట. అలా ఇష్టం లేని వాళ్ళు ఆ గుఱ్ఱాన్ని ఆపొచ్చు. కాని ఎవరైతే ఆ గుఱ్ఱాన్ని ఆపుతారో వారు అయోధ్యతో యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది. ఆ యజ్ఞ దీక్షలో ఉండగానే దశరధుడు 'పుత్ర కామేష్టిఅనే ఇంకో యాగము కూడా చేయడం మొదలు పెట్టాడు.




మీరు విన్న కథ పేరు ఏమిటి?
వాల్మీకి ఎవరు?
వాల్మీకి, శిష్యులు ఏ నది ఒడ్డుకి వెళ్లారు?
అక్కడ వాళ్ళు ఏమి చూసారు?
బోయవాడు అంటే ఎవరు?
బోయవాడు ఏమి చేసాడు?
పక్షి కింద పడిపోవడం చూసిన వాల్మీకి ఏం చేశారు?
వాల్మీకి ఆశ్రమ౦లో ఎవరు ప్రత్యక్షమయ్యారు?
బ్రహ్మ దేవునికి ఎన్ని తలలు ఉంటాయి?
బ్రహ్మదేముడు ఏమి చెప్పాడు?
రామాయణమును ఎన్ని కా౦డాలుగా విభజి౦చారు?
అయోధ్య నగరానికి రాజు ఎవరు?
ఆయనకు ఎంతమంది భార్యలు?
దశరధ మహారాజు, రాణులు ఎందుకు బాధగా ఉన్నారు?
'అశ్వము' అంటే ఏమిటి?
'అశ్వమేధ యాగం' ఎలా చేస్తారు?
దశరధ మహారాజు రెండొవ సారి చేసిన యజ్ఞము పేరేమిటి?






No comments:

Post a Comment