Friday, January 6, 2012

ఉప్పు కప్పురంబు

ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేఱు
పురుషులందు పుణ్య పురుషులు వేఱయా
విశ్వదాభిరామ వినర వేమ!


uppu kappurambu okkapolika nundu 
chooda chooda ruchula jaada vaeru
purushulandhu puNya purushulu vaerayaa
viSwadhaabHiraama vinura vaema!

ఉప్పు, కర్పూరము చూడడానికి తెల్లగా ఒక్కలాగే ఉంటాయి. కాని కొంచెం రుచి చూస్తే వాటి తేడా మనకు అర్ధం అవుతుంది. అలాగే మనుషులందరూ కూడా చూడడానికి ఒక్కలాగే ఉంటారు, కాని కొంచెం పరిచయమయ్యాక వారిలో మంచివారెవరో చెడ్డవారెవరో ఇట్టే తెలిసిపోతుంది. 


No comments:

Post a Comment