Wednesday, December 14, 2011

వేరుపురుగు చేరి

వేరు పురుగు చేరి వృక్షంబు జెరుచును
చీడపురుగు చేరి చెట్టు జెరచు 
కుత్సితుండు చేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినురవేమ!


verupurugu chaeri vrukshambu cheruchunu
cheedapurugu chaeri chettu cheruchu
kutsithundu chaeri guNavanthau cherachuraa
viSwadaabHiraama vinuravaema!

మహా వృక్షము కూడా వేరుకు పురుగుపడితే చచ్చిపోతుంది. చెట్టుకు చీడ పడితే ఆ చెట్టు నాశనమై పోతుంది. అలాగే చెడ్డవాడి వలన ఎంత మంచి వాడైనా  చెడిపోతాడని అర్ధము. కాబట్టి చెడ్డ వాళ్ళతో స్నేహం చెయ్యకూడదు.

వేరు              root
చీడ పురుగు  pest
వృక్షము        big tree
చెరచు           destroy
కుత్సితుడు    bad man
గుణవంతుడు manchi vaadu 

No comments:

Post a Comment