Wednesday, January 29, 2014

అదన్నమాట సంగతి!

"తెలుగెందుకు నేర్చుకోవాలి?" అని అడిగితే పిల్లల దగ్గరనుండి అనేక సమాధానాలు వచ్చాయి. కొంతమంది పిల్లలు "మేము అమెరికాలో ఉంటున్నాం కదా! అసలు మాకు తెలుగు ఎందుకు?" అన్న సందేహం కూడా వ్యక్తపరిచారు. ఆ నేపధ్యంలోనుండి పుట్టినదే 'అదన్నమాట సంగతి'. 

తెలుగు నేర్పించడమే కాక ఈ నాటిక వేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చిన పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నాను. 

నాటిక అనగానే ఎంతో సంబరంగా ముందుకు వచ్చి అందర్నీ హాయిగా నవ్వించిన చిన్నారులకు ఆశీస్సులు.






3 comments:

  1. నాటిక బావుంది. కాని తెలుగు తరగతిలో 'లింగాష్ఠకం' (సంస్కృతం) నేర్పించడం సబబుగాలేదు. భాషకి, మతానికి ముడిపెట్టకూడదని నా ఉద్దేశ్యం.

    ReplyDelete
  2. ఏ మతమైనా మనిషి ప్రవర్తనను సన్మార్గంలో పెట్టడానికే అని మా నమ్మకం. మన సంస్కృతిలో జీర్ణించుకు పోయిన సంస్కృతాన్ని తీసుకున్నాము తప్పితే ఇక్కడ దేనికీ ముడి పెట్టే ఉద్దేశం లేదండి.

    ReplyDelete
  3. మన భాష లన్నిటికీ మూలము "సంస్కృతమే " గా అని మీరు పోల్చిన తీరు బావుంది జ్యోతిగారు

    ReplyDelete