Thursday, February 16, 2012

నీతి వాక్యాలు

1 ఏదైనా పని మొదలుపెట్టినపుడు దాన్ని పూర్తి చేయడం మంచి పిల్లల లక్షణం.

2 చెప్పులు ఒదిలేప్పుడు గుమ్మం ముందు అడ్డం లేకుండా రెండూ ఒకే దగ్గర పెట్టాలి. ఎక్కడికి వెళ్ళినా ఈ అలవాటు మరచిపోకూడదు.

3 బయలుదేరే సమయానికి పది నిముషముల ముందే తయారుగా ఉండాలి. ఆలస్యంగా వెళ్ళడం వలన మనం ఆ కార్యక్రమానికి, ఇతరులకు కూడా చాలా ఇబ్బందిని కలుగాజేస్తాము.

4 వాడుకున్న వస్తువులను వాటికి కేటాయించిన స్థలంలో పెట్టాలి.

5 ఇంటికి వచ్చిన వారిని పలుకరించాలి. అలాగే ఎవరి ఇంటికైనా వెళ్ళినపుడు కూడా ఆ ఇంటి వార౦దనీ పలుకరించాలి.

6 అమ్మనూ నాన్ననూ తప్ప ఎవరినీ తినుబండారాలు(స్నాక్స్) అడుగకూడదు. ఎవరైనా ఇస్తే ఒకటి లేక రెండు మాత్రమే తీసుకోవాలి. అలగే ఏదైనా కొత్త ఫుడ్ ఐటెం ముందు కొద్దిగా తీసుకుని నచ్చితే ఎక్కువ పెట్టుకోవాలి. అనవసరంగా ఫుడ్ వేస్ట్ చెయ్యకూడదు.

7 భోజనానికి ఒక గంట ముందు ఏమీ తినకూడదు. అన్ని రకాల కూరగాయలు, పండ్లు తినాలి.

8. అమ్మానాన్న కూడా ఒకప్పుడు చిన్నపిల్లలే. వాళ్ళకు ఎన్నో విషయాలు తెలుసు. వారి చెప్పినప్పుడు వినాలి. అన్నింటికీ ప్రశ్నలు అడగకూడదు. చెప్పే సమయం వస్తే వారె చెపుతారు.

9 ఇచ్చిన పనిని ముందుగా పూర్తి చేయాలి. చివరి వరకూ చేయకుండా ఉండకూడదు. చివరి వరకూ ఉంచడం వలన అనుకోని అవాంతరాలు వస్తే పూర్తి చేయలేకపోతాము.

10 ఎవరి ఇంటికైనా వెళ్ళి ఆడుకున్న తరువాత వారి ఇంటిని యధాతదంగా ఉంచాలి. అంటే ఆడుకున్న తరువాత బొమ్మలను తీసిన దగ్గర పెట్టాలి. వాళ్ళ ఇంటిలో కూడా అన్నింటిని తీసుకుని పాడుచెయ్యకూడదు.

11
మొహం కడుక్కునేప్పుడు, స్నానం చేసేప్పుడు నీళ్ళు తక్కువ వాడాలి. స్నానం పది నిముషాలలో పూర్తి చేయాలి. 

12 మంచి నీళ్ళు తాగే ప్రతిసారి శుభ్రంగా కడిగి ఆర పెట్టిన గ్లాసును తీసుకోకూడదు. ఒకసారి వాడిన గ్లాసును శుభ్రంగా కడిగి నిర్ణీత ప్రదేశంలో ఉంచి రోజంతా అదే గ్లాసును వాడాలి.

13 స్లీప్ ఓవర్ కి వెళ్ళినపుడు నిద్ర లేచాక మీరు పడుకున్న కంఫర్టర్, దుప్పటి మడత పెట్టి, గోడ దగ్గర ఒకపక్కగా దిండు మీద పెట్టాలి.

14 తినేటప్పుడు నోరు తెరిచి చప్పుడు చేస్తూ తినకూడదు. అలాగే అన్నం తింటున్నప్పుడు ప్లేట్ కూడా శుభ్రంగా ఉండాలి, కెలికినట్లు తినకూడదు.

15 ఎవరి గురించైనా వారి వెనుక చెడ్డగా ఎప్పుడూ మాట్లాడకూడదు. వారు చేసిన పని నచ్చకపోతే సున్నితంగా వారితోనే ఆ విషయ౦ చెప్పాలి.

16 చెడ్డ విషయన్ని పట్టించుకోవడం ఎంత పొరపాటో మంచి విషయాన్ని పట్టించుకోకుండా ఉండడం కూడా అంతే పొరపాటు.

17 ఎవరితోనయినా మాట్లాడేప్పుడు వారిని సంబోధించి మాట్లాడాలి. ఉదాహరణకు ఎవరైనా హాయ్ చెప్పినప్పుడు హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్, హాయ్ రాజ్ ఇలా చెప్పాలి.

18 భోజనం చేసేప్పుడు టివి చూడకూడదు. 


19 పవర్ వృధా చేయకూడదు. గదిలో నుండి బయటకు వచ్చేప్పుడు లైట్, ఫాన్ ఆపేయాలి. 


20 పెద్దవాళ్ళతో మాట్లాడేప్పుడు మర్యాద పాటించాలి. పెద్దవాళ్ళ మీద కోప్పడకూడదు. ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి.


21.మనం ఏ విత్తనాలు చల్లితే ఆ చెట్లు మొలుస్తాయి. మంచి పనులు చేసిన వారిని అభినందించడం వలన సమాజంలో మంచిని పెంచిన వారమౌతాము.

22. బ్రష్ చేసుకునేప్పుడు టాప్ తిప్పి అనవసరంగా నీళ్ళు వృధా చేయకూడదు.

23. ప్రతి ఒక్కరిలో మనం తెలుసుకోవసినది ఉంటుంది. కొంతమందిని చూసి ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. మరికొంతమందిని చూసి ఎలా ఉండకూడదో తెలుసుకోవచ్చు. 

No comments:

Post a Comment