Saturday, October 22, 2011

కూరిమి గల దినములలో

కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసం బైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!

ఎవరితోనైనా స్నేహంగా ఉన్నన్ని రోజులూ వాళ్ళు ఎన్ని తప్పులు చేసిననూ పట్టించుకోము. ఆ స్నేహము పోయిన రోజున వారు చేసే ప్రతి పనిలోనూ తప్పులే వెతుకుతామని భావము.

Koorimi gala dinamulalo
Naeramulennadunu galuga naeravu mari yaa
Koorimi virasambainanu
Naeramulae thochuchundu nikkamu sumathee!


No comments:

Post a Comment