పనులెప్పుడు మొదలెడదాం అంటూ వచ్చేశారు మా బృందమంతా..
ఈ సంవత్సరమే పాఠశాలలో పాఠాలు చెప్పడం మొదలుపెట్టిన బింగు పద్మజ గారు "నేను కార్యక్రమ సమన్వయ కర్త బాధ్యతను తీసుకోవాలనుకుంటున్నాను కాని, ఇంతవరకూ నేను ఒక్క పాఠశాల వార్షికోత్సవమూ చూడలేదు. ఇంత పెద్ద పనిని చేయగలనా?" అన్న సందేహం వ్యక్తం చేశారు. "అసలు చెయ్యాలన్నఆలోచన రావడంతోనే మీ నాయకత్వ లక్షణాలు తేటతెల్లమౌతున్నాయి. వెనుక మేమంతా లేమూ" అని బాధ్యతను ఏకంగా ఆవిడ తల మీద పెట్టేశాము. మూడు నెలల పాటు మొయ్యవలసినదే. పాపం సహాయం కోసం వచ్చినప్పుడు మీ సహకారం అందిస్తారు కదూ!
భోజన ఏర్పాట్లు చూస్తానని ఆనందంగా ముందుకు వచ్చిన వేలూరి రాధ గారితో "ఏమండోయ్ వీళ్ళు రెండు వేలు కూడా ఇవ్వకుండా సుమారుగా ఎనిమిది వందలమందికి పులిహోర, గొంగోరలతో అచ్చతెలుగు భోజనం పెట్టమంటున్నారు, కాస్త ఆలోచించుకోండి" అని పక్కవాళ్ళు హెచ్చరిస్తున్నా వినక, "మన పాఠశాల పేరెంట్స్ గురించి నాకు బాగా తెలుసండి. ఏం ఫరవాలేదు" అని ధీమాగా అనేశారు. "అంతా ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకునేవారే" అనుకునే ఈ రోజుల్లో, దానికి విరుద్దంగా మనష్యుల మీద మానవత్వం మీద ఆవిడకు అంత భరోశా ఏమిటో మరి! దండ హేమ గారు, అంబటి స్వప్న గారు, మలకపల్లి హేమంతి గారు వారికి సహాయం చేస్తామన్నారు.
కార్యక్రమాలు, అంటే నాటికలు, పాటలు, పద్యాలు... ఇవన్నీ ఏ తరగతివారు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం, వారికి కావలసిన సలహా, సహాయం అందించడం. వేదిక దగ్గరుండి కార్యక్రమాలు నిర్వహించడం. ఇదీ పని. వినడానికి సరదాగా ఉంది కదూ! ఇరవై ఐదు తరగతులు చేయబోయే కార్యక్రమాల గురించి ముప్పై ఐదు మంది టీచర్లతో మాట్లాడుతూ ఒక పద్దతిలో కార్యక్రమాన్ని నడిపించడడం అంత తేలిక కాదు. అదృష్టవశాత్తూ ఆ పనిలో నిష్ణాతులైన సూరే మంజుల గారు ముందుకు రావడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం. ఆవిడా, మన ఉపాధ్యాయులు ఎలా చేస్తారో కాని మనం మాత్రం మంచి కార్యక్రమం చూశామని ఆ వార్షికోత్సవం సాయంత్రం తృప్తిగా అనుకోవాలి. మన పని కేవలం టీచర్ చెప్పిన వాటిని పిల్లలకు నేర్పించడం, వారిని అనుకున్న సమయానికి క్లాసుకు తీసుకువెళ్ళడం అంతే! మేడికాయల లక్ష్మి గారు ఆవిడకు సహాయం చేస్తామన్నారు. కోశాధికారిగా కదిరిసెట్టి తమ్మారావు గారు ఈ ఏడాది పాఠశాలకు సంబంధించిన ఖర్చులు,లెక్కలు, కూడికలూ, తీసివేతలు లాంటి పనులన్నీ వారివే.
ఇవి కాక
శుభకార్యానికి పసుపు కొట్టడం లాంటి పని వార్షికోత్సవానికి కావలసిన హాల్ వెతికి బుక్ చెయ్యడం. దేవినేని నీలిమ గారు ఆ బాధ్యత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. గతంలో కోశాధికారిగా ఆవిడ ప్రతిభ జగద్విదితమే. తనకో పనిచ్చి మనం మరచిపోయనా మన వెంట పడి మరీ ఇచ్చిన దానిని విజయవంతంగా పూర్తి చేయగలరు. బహుమతుల కొనుగోలు వ్యవహారం కూడా ఆవిడే చూసుకుంటానన్నారు. కల్యాణి పుల్లేటి గారు ఆవిడకు సహాయం చేస్తామన్నారు.
బానర్ డిజైన్ అనగానే మనం రెండో మాట లేకుండా కొత్త రఘునాథ్ గారు అనేసుకుంటాం. ఒకటేమిటి లెండి ఇక్కడ అక్కడ అనిలేక ఎక్కడ అవసరమైనా ఆయనే ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే పాఠశాలకు సంబంధించి సర్వాంతర్యామి. ఈ సారి ఎరగుడిపాటి శ్రీవాణి గారు ఆ బాధ్యత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. కొత్తగా వచ్చినా ఉపాధ్యాయులందరికీ శ్రీవాణి గారు పరిచయస్తులే. ఆవిడ గురించి చెప్పాలంటే ఇందు గలరు అందు లేరు..ఎందెందు వెతికినా .. అనే పద్యం సరిపోతుంది.
విద్యార్ధుల కోసం ట్రోఫీలు, సర్టిఫికేట్లు తెప్పించే బాధ్యత వేమూరి సత్య గారు, ఫోటోలు, వీడియోలు తీయడం, తీయించడం లాంటి బాధ్యతలు గూడె మురళి మనోహర్ గారు తీసుకున్నారు. వారివురు ముందుకు రాగానే సమావేశంలో కలకలం. పోయిన ఏడాది వార్షికోత్సవం నాడు వారు చేసిన పని ఇంతా అంతా కాదుట. తెర వెనుక ఎక్కడ చూసినా వాళ్ళేనట. కొండమడుగు శివ గారు, దండ గోవిందరావు గారు మురళి గారికి సహాయం చేస్తామన్నారు.
సమావేశానికి హాజరుకాలేక పోయినా మేడికాయాల నరసింహ గారు స్పీకర్స్, మ్యూజిక్ సిస్టం గురించి అన్ని వివరాలు తాను చూసుకుంటానని చెప్పి పంపించారు. కొండమడుగు శివగారు వారికి సహాయం చేస్తామన్నారు.
"ఇతరత్రా ఏ సహాయం కావాలన్నా నేనున్నా" అన్నారు కింతలి అనురాధ గారు. ఆవిడ ఇంకో మాట కూడా అన్నారండోయ్. ఈ సమావేశం జరిగిన తరువాత రోజు ఉదయాన్నే ఫోన్ చేసి "ఏ పార్టీలో కూడా ఇంతలా ఎంజాయ్ చెయ్యలేదు, భలేగా జరిగింది సమావేశం" అని ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.
హాలు శుభ్రత విషయంలో తను బాధ్యత తీసుకుంటానన్నారు మురళి మోహన్ గారు. తన్నీరు లక్ష్మీ రాజేశ్వరి గారు సమావేశానికి హాజరైన ఇరవై మందికి సరిపడా రుచికరమైన ఫలహారాలు స్వయంగా చేసుకుని తీసుకువచ్చారు.
వీరు కాక ఇంకా చాలామంది ఈ సమావేశానికి రాలేకపోతున్నామని ఏ సహాయం చేయడానికైనా సిద్దమేనని మెయిల్, ఫోన్ ద్వారా తెలియజేశారు.
ఇంతమంది నిస్వార్ధంగా కృషి చేస్తుండబట్టే పాఠశాల వార్షికోత్సవం ప్రతి ఏడాది విజయవంతంగా జరుగుతోంది.
ఎందరో మహానుభావులు. అందరికీ వందనం