Wednesday, November 9, 2011

అనగననగ రాగ

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగతినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ!

anagananaga raaga mathisayilluchunundu
thinaga thinaga vaemu thiyyanundu
saadhanamuna panulu samakooru dharalona
viswadaabhiraama vinura vaema!

సాధన(ప్రాక్టీస్) చేయడం వలన రాగం చక్కగా పాడగలుగుతాము. రోజూ తింటూ ఉన్నట్లయితే చేదుగా ఉన్న వేప కూడా తియ్యగా అనిపిస్తుంది. అలాగే ఏ పనైనా చేస్తూ ఉంటే ఆ పనిలో పరిపూర్ణత్వము(పర్ ఫెక్షన్) వస్తుందని వేమన ఈ పద్యంలో చెప్పారు.

నీతి(మోరల్):  ఏదైనా పని చేసేప్పుడు ఆ పనిలో పెర్ఫెక్షన్ వచ్చే వరకూ ప్రయత్నిస్తూ ఉండాలి.

As you sing(again and again), the melody(raga) excels
As you eat Neem(again and again), it becomes sweeter
with practice, things become perfect
Beloved of the Bounteous, Vema, listen!

No comments:

Post a Comment